- ( బాలీవుడ్‌ - ఇండియా హెరాల్డ్ ) . . .

బాలీవుడ్ లో ఏజ్ గ్యాప్ పై చర్చ ఇప్పటిది కాదు .. ఎప్పటికప్పుడు ఈ అంశం తెరమీదకు వస్తోంది. మొన్న ఏఆర్ . మురగదాస్ దర్శకత్వంలో సల్మాన్ ఖాన్ - రష్మిక మంద‌న్న జంటగా సికిందర్ సినిమా తెరకెక్కింది. ఆ టైంలో రష్మిక - సల్మాన్ ఖాన్ మధ్య ఏజ్ గ్యాప్ అంశం బాగా చర్చినీయాంశం అయింది. తాజాగా ఇప్పుడు మరోసారి ఇది తెరమీదకు వచ్చింది. సారా అర్జున్ గురించి అందరికీ తెలిసిందే. బాలనటిగా ఎన్నో సినిమాలలో మెప్పించిన ఆమె ఇప్పుడు హీరోయిన్గా ఎదిగింది. రన్వీర్ సింగ్ సినిమాలో కనిపించింది. సారా అర్జున్ వయసు 19 ఏళ్ళు .. ర‌ణ్వీర్ సింగ్ వయస్సు 40. అంటే ఇద్దరు మధ్య 20 ఏళ్లకు పైగానే ఏజ్ గ్యాప్ ఉంది. అంత చిన్న అమ్మాయితో ఎలా నటిస్తాడంటూ ? చర్చ మొదలైంది.


అయితే సల్మాన్ - రష్మిక‌ జంటతో పోలిస్తే రణవీర్ - సారా జోడి ఏమంత ఎబెట్టుగా లేదని కామెంట్స్ పెడుతున్నాయి. ఐదేళ్ల వయసు నుంచి సారా హీరోయిన్ గా నటిస్తోంది. విక్రమ్ హీరోగా నటించిన నాన్న సినిమాలో చిన్నప్ప‌టి న‌టి సారా కావటం విశేషం. పొన్నియ‌న్ సెల్వ‌న్ సినిమాలో ఆమె టీనేజ్ లుక్స్ కు మంచి మార్కులు పడ్డాయి. తర్వాత కాస్త గ్యాప్ తీసుకుని ఇప్పుడు రన్వీర్ సింగ్ సినిమాతో ఏకంగా హీరోయిన్ అయిపోయింది. సహాయ న‌టిగా మెప్పించిన సారా మరి హీరోయిన్గా ఎలా రాణిస్తుందో ? చూడాలి.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: