
ప్రస్తుతం ఈ బ్యూటీ ఇటు సౌత్ తో పాటు అటు నార్త్ లోనూ అగ్ర తారగా సత్తా చాటుతుంది. చేతినిండా సినిమాలతో క్షణం తీరిక లేకుండా గడుపుతోంది. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో రష్మిక తన వ్యక్తిగత జీవితం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. `బిజీ షెడ్యూల్ కారణంగా ఫ్యామిలీకి దూరమయ్యారు, స్నేహితులకు దూరమయ్యాను. ఏడాదిన్నరగా నేను మా ఇంటికే పోలేదు. నాకు 13 ఏళ్ల చెల్లి ఉంది. నాకన్నా పదహారేళ్లు చిన్నది. కెరీర్ స్టార్ట్ చేసి ఎనిమిదేళ్లు అవుతున్న ఇప్పటికీ నేను ఆమెను సరిగ్గా చూసుకోలేకపోతున్నాను. అది నన్ను ఎంతగానో బాధిస్తోంది` అంటూ రష్మిక తన మనసులో బాధను బయటపెట్టింది.
కెరీర్‌లో రాణించాలంటే పర్సనల్ లైఫ్ ను త్యాగం చేయాలి. అదే పర్సనల్ లైఫ్ లో సంతోషంగా ఉండాలంటే కెరీర్ లో కొన్నిటిని వదిలేయాలని అమ్మ చెబుతుంటుంది. కానీ ఆ రెండిటిని బ్యాలెన్స్ చేసేందుకు నేను తీవ్రంగా కష్టపడుతున్నానని రష్మిక చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఆమె కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మొత్తంగా వృతి జీవితం రష్మిక వ్యక్తిగత జీవితాన్ని ఎంతలా ప్రభావితం చేస్తుందో ఆమె వ్యాఖ్యలతోనే స్పష్టమైంది. కాగా, రీసెంట్ గా `కుబేర`తో హిట్ కొట్టిన రష్మిక.. ఇప్పుడు `ది గర్ల్‌ఫ్రెండ్`, `మైసా` మరియు బాలీవుడ్ లో `థామ` అనే చిత్రాలు చేస్తోంది. ఈ మూడు ప్రాజెక్ట్స్ సెట్స్ మీదే ఉన్నాయి.