టాలీవుడ్ యువ నటుడు విజయ్ దేవరకొండ తాజాగా కింగ్డమ్ అనే సినిమాలో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో మోస్ట్ బ్యూటిఫుల్ నటిమని భాగ్య శ్రీ బోర్స్ హీరోయిన్గా నటించగా ... గౌతమ్ తిన్ననూరి ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై సూర్య దేవర నాగ వంశీ నిర్మించిన ఈ మూవీ కి అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందించాడు. ఈ మూవీ ని మొత్తం రెండు భాగాలుగా విడుదల చేయనున్నారు. ఈ సినిమా యొక్క మొదటి భాగాన్ని ఈ నెల 31 వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. చాలా రోజుల నుండి ఈ మూవీ విడుదల తేదీ పై పెద్ద ఎత్తున సస్పెన్స్ నెలకొంది.

ఈ సినిమాను ఏ తేదీన విడుదల చేస్తారు అనే దానిపై అనేక రూమర్స్ వచ్చాయి. ఎట్టకేలకు ఈ మూవీ విడుదల తేదీ పై అధికారిక ప్రకటన రావడంతో విజయ్ అభిమానులు ఆనంద పడుతున్నట్లు తెలుస్తోంది. తాజాగా విజయ్ దేవరకొండ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. అందులో భాగంగా ఆయన చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. తాజా ఇంటర్వ్యూ లో భాగంగా విజయ్ దేవరకొండ మాట్లాడుతూ ...  ఎవరైనా దర్శకుడు నాకు ఓ కథ చెబితే అందులో ఏమైనా లోపాలు ఉంటే అందులో లోపాలు ఉన్నాయి అని నేను చెప్పలేను. నాకు నా వెనక ఎవరూ లేరు. నాకు ఇండస్ట్రీ సపోర్టు కూడా లేదు. ఇక ఇండస్ట్రీలో మరో హీరో తండ్రికి ఇన్ఫ్లూయెన్స్ బాగా ఉంది.

వాళ్ళు స్క్రిప్ట్ అంతా బాలేక పోయినట్లయితే వారు స్క్రిప్ట్ లో లోపాల గురించి ఆ దర్శకుడితో మాట్లాడగలరు అని విజయ్ దేవరకొండ చెప్పుకొచ్చాడు. ఇలా విజయ్ దేవరకొండ తాజా ఇంటర్వ్యూలో భాగంగా చేసిన  ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఇది ఇలా ఉంటే తాజాగా విజయ్ దేవరకొండ నటించిన కింగ్డమ్ సినిమాపై ప్రస్తుతానికి ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. మరి ఈ సినిమాతో విజయ్ దేవరకొండ ఏ స్థాయి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

Vd