తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ఒక మంచి గుర్తింపును ఏర్పరచుకున్న వారిలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఒకరు. ఈయన కొంత కాలం క్రితం హిందీ చత్రపతి సినిమాలో హీరో గా నటించాడు. ఈ సినిమా బాక్సా ఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఈ మూవీ తర్వాత ఈయన భైరవం అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు. ఈ సినిమా కూడా ఈయనకు నిరాశనే మిగిల్చింది. తాజాగా ఈయన కిష్కింధపురి అనే సినిమాలో హీరో గా నటించాడు. కొంత కాలం క్రితం విడుదల ఆయన ఈ సినిమాకు బాక్సా ఫీస్ దగ్గర మంచి టాక్ వచ్చింది. దానితో ఈ సినిమాకు మంచి కలెక్షన్లు కూడా దక్కాయి.

మూవీ లో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్గా నటించింది. ఇకపోతే ఈ సినిమా యొక్క ఓ టీ టీ హక్కులను ప్రముఖ డిజిటల్ సంస్థలలో ఒకటి అయినటువంటి జీ 5 సంస్థ వారు భారీ దరకు దక్కించుకున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీ ని జీ 5 ఓ టి టి ప్లాట్ ఫామ్ వారు అక్టోబర్ 17 వ తేదీ నుండి తమ ఓ టీ టీ ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ చేయనున్నట్లు , అందుకు సంబంధించిన అధికారిక ప్రకటనను కూడా మరికొన్ని రోజుల్లోనే జీ 5 సంస్థ వారు విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది.

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కి చాలా సంవత్సరాల క్రితం రాక్షసుడు అనే సినిమాతో మంచి విజయం దక్కింది. ఆ తర్వాత కిష్కిందపురి అనే సినిమాతోనే మంచి విజయం దక్కింది. రాక్షసుడు సినిమాలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్గా నటించింది. కిష్కింధపురి సినిమాలో కూడా అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్గా నటించింది. ఇలా అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్గా నటించిన రెండు సినిమాలతో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కు మంచి విజయాలు దక్కాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

Bss