
గతంలో ఆర్ఆర్ఆర్ సమయంలోనూ ఇలాంటి కాంట్రవర్సీ పెద్ద ఎత్తున తలెత్తింది. అల్లూరి సీతారామరాజు, కొమరం భీమ్‌లు కలిసి పోరాడినట్టు చూపించి చరిత్రను వక్రీకరించారని కొందరు రాజమౌళిపై ఆరోపణలు చేశారు. కానీ, సినిమా రిలీజ్ అయ్యాక జక్కన్న మ్యాజిక్ ముందు ఆ హడావిడి సద్దుమణిగింది. ఇప్పుడు హరిహర వీరమల్లు కూడా అదే బాట పట్టినట్టు కనిపిస్తోంది. క్రిష్ దర్శకత్వంలో ప్రాజెక్ట్ ప్రకటించినప్పుడు పండగ సాయన్న కథగా ప్రచారం జరిగింది, బహుశా అదే ఇప్పుడు వివాదానికి కారణం కావొచ్చు. వివాదాలు ఎలా ఉన్నా, రిలీజ్‌కు బ్రేకులు పడే ఛాన్స్ దాదాపు లేదు. డిస్ట్రిబ్యూటర్లు ఒక్కొక్కరుగా లైన్‌లోకి వస్తున్నారు, యుఎస్‌లో అడ్వాన్స్ బుకింగ్స్ ఇప్పటికే షురూ అయ్యాయి. కీరవాణి రీ-రికార్డింగ్‌లో కొంత పని బ్యాలన్స్ ఉన్నా, ఆయన తండ్రి శివశక్తి హఠాన్మరణం వల్ల కొంచెం ఆలస్యమైనప్పటికీ, జూలై 24 రిలీజ్ డేట్ మిస్ అయ్యే అవకాశం లేదు.
మరోవైపు, మార్కెట్‌లో హరిహర వీరమల్లుకి ఓపెన్ గ్రౌండ్ దొరికింది. కుబేర హిట్ తర్వాత వచ్చిన కన్నప్ప, తమ్ముడు సినిమాలు నిరాశపరిచాయి. ఒకవేళ కంటెంట్ అన్ని వర్గాలకు కనెక్ట్ అయితే, పవన్ కళ్యాణ్ బాక్సాఫీస్ వద్ద సృష్టించబోయే రికార్డులు మాములుగా ఉండవు. ట్రైలర్ ఇప్పటికే యూట్యూబ్‌లో రికార్డు వ్యూస్‌తో దూసుకెళ్తోంది, ఫ్యాన్స్ ఈ రచ్చ కోసం ఫుల్ జోష్‌లో వెయిట్ చేస్తున్నారు! హరిహర వీరమల్లు కేవలం సినిమా కాదు, సనాతన ధర్మం గొప్పతనాన్ని, పవన్ కళ్యాణ్ యాక్షన్ హీరోయిజాన్ని మైథలాజికల్ టచ్‌తో మిక్స్ చేసిన ఓ గ్రాండ్ విజువల్ ఫీస్ట్. వివాదాలు వచ్చినా, ఈ వీరుడి స్వార్డ్ బాక్సాఫీస్‌ను షేక్ చేయడం పక్కా!