
మహేష్ రాజమౌళి కాంబినేషన్లో ఒక సినిమా అత్యంత భారీ బడ్జెట్ తో ఇతర భాషల కీలక నటీనటులతో తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాకు సంబంధించి అధికారికంగా ఎలాంటి అప్డేట్స్ అయితే రావడం లేదు. పృథ్వీరాజ్ సుకుమారన్, ప్రియాంక చోప్రా లాంటి కీలక నటీనటులు ఈ సినిమాలో నటిస్తున్నా రాజమౌళి నుంచి మాత్రం ఇందుకు సంబంధించి ఎలాంటి స్పందన లేదు. గత సినిమాల విషయంలో జక్కన్న హడావిడి చేయగా ఈ సినిమాకు సంబంధించి మాత్రం సైలెన్స్ సమాధానంగా వినిపిస్తోంది.
అయితే ప్రస్తుతం పాన్ వరల్డ్ స్థాయిలో జక్కన్నకు క్రేజ్ ఉంది. రాజమౌళి సినిమాలు అంచనాలకు మించి బిజినెస్ చేయడంతో పాటు నాన్ థియేటర్ హక్కుల విషయంలో సైతం సంచలనాలు సృష్టిస్తున్నాయి. ఈ సినిమా విడుదల కావడానికి మరో రెండు నుంచి మూడేళ్ల సమయం పట్టే అవకాశం ఉంది. నాటు నాటు పాటకు ఆస్కార్ రావడం కూడా జక్కన్నకు ఎంతగానో ప్లస్ అయింది.
ఒకప్పుడు తన సినిమాల అప్డేట్స్ ఇవ్వడం ద్వారా అంచనాలు పెంచిన రాజమౌళి ఇప్పుడు మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరించడం ద్వారా అంచనాలను పెంచే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఈ సినిమా విషయంలో గత సినిమాలకు భిన్నమైన స్ట్రాటజీని ఫాలో అవుతున్నారు. రాజమౌళి తన సినిమాల ప్రమోషన్స్ కోసం ఎక్కువ మొత్తం ఖర్చు చేయరనే సంగతి తెలిసిందే. తెలివైన మార్కెటింగ్ స్ట్రాటజీలతో రాజమౌళి ముందుకెళ్తారు.
అయితే మరో నెల రోజుల్లో సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టినరోజు ఉన్న నేపథ్యంలో ఆరోజైనా ఈ సినిమా నుంచి అప్డేట్ వస్తుందేమో చూడాల్సి ఉంది. ప్రస్తుతం మహేష్ బాబు నటిస్తున్న ఏకైక సినిమా ఇదే కావడంతో అభిమానులు ఈ సినిమాపై చాలా ఆశలు పెట్టుకున్నారు. ఈ సినిమా వాళ్ళ ఆశలను నెరవేరుస్తుందని చెప్పడంలో ఎలాంటి సందేహం అవసరం లేదు. అయితే బాహుబలి 2 పుష్ప2 సినిమాల కలెక్షన్లను మాత్రం ఈ సినిమా బ్రేక్ చేస్తుందా లేదా అనే ప్రశ్న మాత్రం అభిమానులను వేధిస్తోంది.