టాలీవుడ్ ఇండస్ట్రీలో అక్కినేని ఫ్యామిలీకి ఎలాంటి పరువు ప్రతిష్టలు ఉన్నాయి అనేది ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు.  మరీ ముఖ్యంగా ఒకప్పుడు అక్కినేని ఫ్యామిలీ ని సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ చేసే వాళ్ళు ఆకతాయిలు.  ఇప్పుడు ఆ నెగిటివిటీ మొత్తం పాజిటివ్ గా మారిపోయింది . దానికి కారణం నాగచైతన్య పెళ్లి చేసుకోవడం అదేవిధంగా నాగచైతన్య 100 కోట్ల క్లబ్ లోకి చేరడం . అదే విధంగా అఖిల్ అక్కినేని కూడా పెళ్లి చేసుకుని లైఫ్ లో సెటిల్ అయిపోవడం ..అఖిల్ అక్కినేని కూడా సినిమాల విషయంలో కాన్సన్ట్రేషన్ చేస్తూ "లెనిన్" లాంటి సూపర్ డూపర్ కాన్సెప్ట్ ఉన్న మూవీని చూస్ చేసుకోవడం .


అంతేకాదు రీసెంట్ గానే " కుబేర " సినిమాతో నాగార్జున కూడా 100 కోట్ల క్లబ్ లోకి చేరిపోయాడు . ఇలా బ్యాక్ టు బ్యాక్ అక్కినేని  ఫ్యామిలీకి అన్ని గుడ్ న్యూస్ లే  వినిపిస్తూ వస్తున్నాయి . ఇదే మూమెంట్లో "తండేల్" సినిమా తర్వాత నాగచైతన్య కార్తీక్ వర్మ దండుతో ఒక మూవీకి కమిట్ అయ్యాడు.  "వృషి కరం"  అంటూ ఈ సినిమాకి టైటిల్ పెట్టినట్లు తెలుస్తుంది . ఈ సినిమాలో నాగ చైతన్య కి జోడిగా మీనాక్షి చౌదరి నటిస్తుంది. ఈ సినిమా అయిపోయిన తర్వాత తమిళ్ డైరెక్టర్ పి.ఎస్ మిత్రన్ తో ఒక సినిమా చేయబోతున్నట్లు టాక్ వినిపిస్తుంది .



నాగచైతన్య ఈ ప్రాజెక్ట్ ని ఓకే చేశాడు అంటూ సినీ వర్గాలు తెలుపుతున్నాయి . ప్రెసెంట్ మిత్రం కార్తీ తో "సర్ధార్ 2" చేస్తున్నాడు . ఈ సినిమా అయిపోగానే నాగచైతన్య సినిమా సెట్స్ పైకి తీసుకొచ్చి ఆలోచన చేస్తున్నారట . మరొక పక్క తండ్రి నాగార్జున సైతం తమిళ్ డైరెక్టర్ కార్తీక్ తోనే సినిమా చేయడానికి ప్లాన్ చూసుకుంటున్నాడు . త్వరలోనే ఈ సినిమాలు మొదలు కాబోతున్నాయి.  తండ్రి బాటలోనే నాగచైతన్య సైతం తమిళ డైరెక్టర్స్ కి ఛాన్స్ ఇవ్వడం హైలెట్ అవుతుంది. తెలుగులో బోలెడు డైరెక్టర్స్ ఉన్నారు.. అవకాశాలు కూడా వస్తున్నాయి . కానీ నాగచైతన్య -  నాగార్జున తమిళ ఇండస్ట్రీ వైపు మొగ్గు చూపుతూ ఉండటం తమిళ డైరెక్టర్లకే ప్రిఫరెన్స్ ఇస్తూ ఉండడం ఇప్పుడు హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది . అక్కినేని ఫ్యాన్స్ ని ఎంటర్టైన్ చేయడానికి న్యాచురల్ కధలతో ముందుకు రాబోతున్నారు అక్కినేని హీరోస్ అంటూ తెగ పొగిడేస్తున్నారు అక్కినేని అభిమానులు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: