పవన్ కళ్యాణ్ ప్రకాష్ రాజ్ వీరిద్దరూ కలిసి ఎన్నో సినిమాల్లో నటించారు. కానీ తెరమీద కలిసి నటించినప్పటికీ బయట మాత్రం వీరికి క్షణం పడదు.సనాతన ధర్మం అంటూ పవన్ కళ్యాణ్ చెప్పుకు తిరగడం ప్రకాష్ రాజ్ కి అస్సలు నచ్చదు. ఒకప్పుడు హిందీ భాషకి వ్యతిరేకి అయిన పవన్ కళ్యాణ్ సడన్గా రూటు మార్చడంతో ప్రకాష్ రాజు సోషల్ మీడియా వేదికగా జస్ట్ ఆస్కింగ్ అంటూ సంధించే బాణాలు అన్ని ఇన్నీ కావు. ఇప్పటికే గత కొద్ది రోజుల నుండి ట్విట్టర్ వేదికగా పవన్ కళ్యాణ్ ప్రకాష్ రాజ్ మధ్య ట్వీట్ ల యుద్ధం నడుస్తున్న సంగతి మనకు తెలిసిందే.అయితే తాజాగా పవన్ కళ్యాణ్ తెలుగు భాష తల్లి వంటిది హిందీ భాష పెద్దమ్మ వంటిది అని మాట్లాడడం చాలామందికి నచ్చడం లేదు. ముఖ్యంగా ప్రకాష్ రాజ్ లాంటి వాళ్ళు అయితే దొరికిందే సందు అనుకొని పవన్ కళ్యాణ్ ని ఏకిపారేస్తున్నారు.

అయితే తాజాగా పవన్ కళ్యాణ్ మాట్లాడిన వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ దీనిపై ప్రకాష్ రాజ్ ఒక సంచలన ట్వీట్ చేశారు.ప్రస్తుతం ప్రకాశ్ రాజ్ చేసిన ఈ ట్వీట్ నెట్టింట సంచలనం సృష్టిస్తోంది.మరి ఇంతకీ ప్రకాష్ రాజ్ ఏం ట్వీట్ చేశారయ్యా అంటే.. పవన్ కళ్యాణ్ తెలుగు భాష తల్లి లాంటిది..హిందీ భాష పెద్దమ్మ లాంటిది..అని మాట్లాడిన వీడియోని షేర్ చేస్తూ ఛీ ఛీ ఈ రేంజ్ కి అమ్ముకోవడమా.. #Justasking అంతే అన్నట్లు ఒక ట్వీట్ పెట్టాడు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ పై ప్రకాష్ రాజ్ పెట్టిన ట్వీట్ నెట్టింట దుమారం సృష్టిస్తుంది. అంతేకాదు పూర్తిగా  బిజెపి కార్యకర్తగా మారిపోయిన పవన్ కళ్యాణ్ అంటూ చాలామంది పవన్ కళ్యాణ్ పై కామెంట్లు పెడుతున్నారు.

ఒకప్పుడు హిందీ గో బ్యాక్ అని నినదించిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు హిందీ భాష పెద్దమ్మ లాంటిది అని చెప్పి పూర్తిగా కేంద్రం ఎజెండాను మోస్తున్నారని పలువురు నెటిజన్లు పవన్ కళ్యాణ్ పై మండి పడుతున్నారు. మీ స్వార్థ రాజకీయాల కోసం ఏమైనా చేస్తారా అంటూ ఫైర్ అవుతున్నారు. అయినా రాజకీయ నాయకులు అంటే మీలాగే ఉంటారని మరొకసారి రుజువు చేసుకున్నారు.కుదిరితే అలా లేకపోతే ఇలా అన్నింట్లో సేఫ్ సైడ్ చూసుకుంటారు. మీ స్వార్థం కోసమే అన్ని మాట్లాడతారు అంటూ పవన్ కళ్యాణ్ పై నిప్పుల చెరుగుతున్నారు నెటిజన్స్.ఏది ఏమైనప్పటికీ ప్రకాష్ రాజ్ పెట్టిన మంట సోషల్ మీడియాలో బాగానే రాజుకుంది అని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: