సీనియర్ నటి సరోజా దేవి ఈరోజు మరణించిన సంగతి మనకు తెలిసిందే. అయితే సరోజా దేవి మరణంతో ఆమె గురించి ఎన్నో తెలియని విషయాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి.180 కి పైగా సినిమాల్లో నటించిన సరోజా దేవి ఎంతోమంది అప్పటి తరం హీరోలతో జత కట్టింది. అలా ఎన్టీఆర్, ఏఎన్నార్, ఎంజీఆర్ వంటి హీరోలతో జతకట్టిన సరోజా దేవి ఏకంగా రాజీవ్ గాంధీనే రిజెక్ట్ చేసిందట.. మరి ఇంతకీ రాజీవ్ గాంధీని సరోజ దేవి ఏ విషయంలో రిజెక్ట్ చేసింది అనేది ఇప్పుడు తెలుసుకుందాం. సినిమాలతో రారాణిగా నిలిచిన సరోజాదేవిని అందానికి నిదర్శనంగా చెప్పుకుంటారు.. చాలామంది దర్శక నిర్మాతలు హీరోలు అందం అంటే సరోజ దేవిలా ఉండాలి. హీరోయిన్లు అంటే సరోజా దేవి రూపంతో ఉండాలి అని మెచ్చుకునేవారట. 

అలా అందానికి ప్రతీకగా ఉన్న సరోజా దేవి ఎన్నో సినిమాలలో నటించి స్టార్ గా రాణిచ్చింది. అయితే అప్పట్లో సినిమాల్లో రాణించి ఫేమస్ అయిన వారిని రాజకీయాల్లోకి కూడా ఆహ్వానించేవారు. అలా అప్పట్లో రాజీవ్ గాంధీ కూడా సరోజా దేవిని కాంగ్రెస్ పార్టీలోకి రమ్మని కర్ణాటకలోని మాండ్య నియోజకవర్గం నుండి పోటీ చేయమని కోరారట.ఎంపీ పదవి ఇస్తామని కూడా చెప్పారట. కానీ రాజీవ్ గాంధీ స్వయంగా వచ్చి మరీ రిక్వెస్ట్ చేసినా సరోజా దేవి ఒప్పుకోలేదట. నేను రాజకీయాల్లోకి రాను అని రాజీవ్ గాంధీ మొహం మీదే చెప్పిందట. అయితే సరోజా దేవి రాజకీయాల్లోకి రాకపోవడానికి ఒక కారణం ఉంది.

అదేంటంటే..రాజకీయాల్లోకి వస్తే కొంతమందికి మంచివాళ్ళలా మరికొంతమందికి చెడ్డవారిలా కనిపిస్తారు. రాజకీయాల్లో ఉన్నవారు అందరికీ పూర్తి న్యాయం చేయలేరు.. ఓ వర్గం ప్రజలు ఆదరిస్తే మరో వర్గం ప్రజలు ద్వేషిస్తారు. అలా రాజకీయాల్లో ఉంటుంది. అంతేకాకుండా రాజకీయాల్లోకి వచ్చాక నిజాయితీ ఉండదు అని ఆమె అభిప్రాయం. రాజకీయాల్లో నిజాయితీగా ఉండడం కుదరదు కాబట్టి రాజీవ్ గాంధీ ఆఫర్ ని రిజెక్ట్ చేసిందట. దీనికి కారణం కూడా లేకపోలేదు అదేంటంటే సరోజా దేవి తల్లి.. అయితే సరోజా దేవి తల్లి బతికున్నన్ని రోజులు నిజాయితీగా బతకాలని చెప్పేదట.అలా తల్లికి ఇచ్చిన మాట కోసం సరోజా దేవి జీవితకాలం నిజాయితీతోనే బతికింది. అందుకే రాజకీయాల్లోకి రాలేదట.

మరింత సమాచారం తెలుసుకోండి: