
డైరెక్టర్ కృష్ణవంశీ తన చిత్రాలలో ఎక్కువగా కీలకమైన పాత్రలలో ప్రకాష్ రాజుకే అవకాశం కల్పిస్తూ ఉంటారు. కృష్ణవంశీ దర్శకత్వం వహించిన ఖడ్గం సినిమాకు ప్రకాష్ రాజుకు ఉత్తమ నటుడుగా కూడా నంది అవార్డు అందుకున్నారు. తెలుగులో క్యారెక్టర్ ఆర్టిస్టులు కొరత ఉందని ఎక్కువమంది నటులు రావాలంటు కృష్ణవంశీ అప్పట్లో వ్యాఖ్యానించారు. అయితే ఈ వ్యాఖ్యలకు కోట ఆగ్రహం తెచ్చుకుని మాట్లాడారట. తెలుగులో మంచి ఆర్టిస్టులే లేరని ఎలా అంటారు? మీరు పాత్రలు ఇవ్వండి మనవాళ్లు టాలెంట్ తో చేసి చూపిస్తారంటూ కృష్ణవంశీకి కౌంటర్ వేశారు.
అలా వీరిద్దరి మధ్య ఒక మాట యుద్ధమే నడిచింది. మీ చిత్రంలో తనకు ఒక పాత్ర ఇవ్వండి తానేంటో చూపిస్తానంటూ కోట సవాలు విసిరారు.. ఆ సమయంలోనే సినీ పెద్దలు సైతం జోక్యం చేసుకొని మరి ఇద్దరికి సర్ది చెప్పారట. అలా కోటా శ్రీనివాసరావుకు కృష్ణవంశీ రాఖి చిత్రంలో అవకాశాన్ని కల్పించారు. హీరోకి తాత పాత్రలో అద్భుతంగా నటించారు కోట. ఆ తర్వాతే వీరిద్దరి మధ్య విభేదాలు పూర్తిగా సర్దుమనిగాయి.. ఈ విషయంపై ఒక ఇంటర్వ్యూలో కూడా కృష్ణవంశీ గతంలో కోటా శ్రీనివాసరావుతో జరిగిన గొడవకి పశ్చాత్తాపం తెలియజేశారు. తప్పు తనదే అంటూ కూడా అంగీకరించారు. కోట శ్రీనివాసరావు కూడా మన నటులను ఎవరు తక్కువ చేసి మాట్లాడకూడదు అందుకే గొడవ పడ్డానని ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు.