ఇండియా వ్యాప్తంగా నటిగా అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్న వారిలో కియార అద్వానీ ఒకరు. ఈమె బాలీవుడ్ సినిమాల ద్వారా కెరిర్ను మొదలు పెట్టి హిందీ సినీ పరిశ్రమలో మంచి గుర్తింపును సంపాదించుకున్న తర్వాత తెలుగు సినిమాలలో నటించడం మొదలు పెట్టింది. అందులో భాగంగా ఇప్పటికే తెలుగులో ఈమె మహేష్ బాబు హీరోగా రూపొందిన భరత్ అనే నేను , రామ్ చరణ్ హీరోగా రూపొందిన వినయ విధేయ రామ , గేమ్ చేంజర్ సినిమాలలో హీరోయిన్గా నటించి తెలుగులో కూడా మంచి గుర్తింపును సంపాదించుకుంది.

ఇకపోతే తాజాగా ఈ బ్యూటీ జూనియర్ ఎన్టీఆర్ , హృతిక్ రోషన్ ప్రధాన పాత్రలలో నటించిన వార్ 2 మూవీ లో హీరోయిన్గా నటించింది. ఈ మూవీ ఆగస్టు 14 వ తేదీన విడుదల కానుంది. ఈ బ్యూటీ కొంత కాలం క్రితం బాలీవుడ్ నటుడు అయినటువంటి సిద్ధార్థ్ మల్హోత్రా ను ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం మన అందరికీ తెలిసిందే. ప్రస్తుతం వీరి సంసార జీవితం ఎంతో ఆనందంగా ముందుకు సాగుతుంది. ఇకపోతే తాజాగా కియార అద్వానీ పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈమె ముంబైలోని రిలయన్స్ ఆసుపత్రిలో ప్రసవించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం తల్లి బిడ్డ ఇద్దరు కూడా క్షేమంగా ఉన్నట్లు సమాచారం. ఈ సంవత్సరం ఫిబ్రవరి 28 వ తేదీన కియార అద్వానీ , సిద్ధార్థ్ మల్హోత్రా జంట తాము తల్లిదండ్రులను కాబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు.

సిద్ధార్థ్  మల్హోత్రా , కియారా అద్వానీ కాంబోలో షేర్షా అనే మూవీ వచ్చింది. ఈ మూవీ సమయం లోనే వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. ఆ తర్వాత ఆ ప్రేమ పెళ్లికి దారితీసింది. 2023 వ సంవత్సరం ఫిబ్రవరి 7 వ తేదీన వీరు వివాహం జరిగింది. పెళ్లి తర్వాత వీరిద్దరు కూడా వరుస సినిమాల్లో నటిస్తూ అద్భుతమైన జోష్లో కెరియర్ను ముందుకు సాగిస్తున్నారు. సిద్ధార్థ్ మల్హోత్రా ప్రస్తుతం పరమ్ సుందరి అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: