చాలామంది నటీనటులు సినిమా కోసం ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉంటారు. అలా హీరోయిన్లు అయితే బోల్డ్ సన్నివేశాలలో చేయడానికి రెడీగా ఉంటారు. హీరోలు ఎలాంటి యాక్షన్ చేసే సన్నివేశాలకైనా సిద్ధంగా ఉంటారు.. అయితే ఓ హీరో మాత్రం సినిమా కోసం ఏకంగా తన ప్రాణాల్ని సైతం లెక్కచేయలేదట. ప్రాణాలను పణంగా పెట్టి ఓ సీన్ కోసం నటించారట.మరి ఇంతకీ ఆ హీరో ఎవరయ్యా అంటే అక్కినేని నాగార్జున.. ప్రేమ కథా సినిమాలైనా.. యాక్షన్స్ సినిమాలైనా..భక్తిరస సినిమాలైనా.. ఎమోషనల్ సినిమాలైనా నవరసాలు పండించగల హీరోలలో నాగార్జున ఇప్పటి జనరేషన్ హీరోలలో ముందు ఉంటారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈయన ఇప్పటివరకు భక్తిరస సినిమాలతో పాటు ప్రేమ కథ ఎమోషనల్ అన్ని సినిమాల్లో కూడా నటించారు. 

అయితే అలాంటి నాగార్జున భక్తి భావంతో నటించిన శ్రీరామదాసు, అన్నమయ్య, షిరిడి సాయి, నమో వెంకటేశాయా వంటి సినిమాలో నటించారు.ఈ సినిమాల్లో శ్రీరామదాసు, అన్నమయ్య రెండు సినిమాలు కూడా బ్లాక్ బస్టర్..ముఖ్యంగా అన్నమయ్య సినిమాలో ఓవైపు ఇద్దరు భార్యలతో రొమాన్స్ పండిస్తూనే మరోవైపు భక్తి లో కూడా మునిగిపోయి నటించారు. అయితే ఈ సినిమాలో నాగార్జున క్లైమాక్స్లో ముసలి పాత్రలో నటించిన సంగతి మనకు తెలిసిందే. అయితే ఈ సినిమా క్లైమాక్స్ లో ముసలి పాత్రలో నటించినప్పుడు వాయిస్ లో కాస్త తేడా కనిపించాలి. అయితే చాలాసేపు ముసలి పాత్రలో మాట్లాడాలి కాబట్టి కాస్త రిస్క్ అవుతుంది అని భావించిన డైరెక్టర్ రాఘవేంద్రరావు ఈ క్లైమాక్స్ సీన్ కోసం ఎస్పీ బాలసుబ్రమణ్యం వాయిస్ ఇవ్వమని అడుగుదామనుకున్నారట.

 కానీ నాగార్జున మాత్రం సినిమా మొత్తం నేను మాట్లాడి క్లైమాక్స్లో బాలసుబ్రమణ్యం గారు మాట్లాడితే బాగుండదు. నేనే ముసలివాడిలా మాట్లాడతానని చెప్పాడట. అయితే ముసలి వాళ్ళ లాగా వాయిస్ రావాలంటే చాలా కష్టం. కానీ దానికోసం నాగార్జున ముందు రోజు రాత్రి దాదాపు ఒక కేజీ ఐస్ ముక్కలను తిన్నారట.ఇక కేజీ ఐస్ ముక్కలు అంటే మామూలు విషయం కాదు. ఐస్ ముక్కలు అన్ని ఒకేసారి తింటే గొంతు ఇన్ఫెక్షన్ వచ్చి ప్రాణానికే ప్రమాదం. కానీ తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా నాగార్జున అన్నమయ్య సినిమా కోసం ఈ రిస్క్ చేశారట.ఇక ఆ నెక్స్ట్ డే నాగార్జున మాట చూసి డైరెక్టర్ సైతం ఆశ్చర్యపోయారట.అయితే ఈ విషయాన్ని నాగార్జున రాఘవేంద్రరావు సౌందర్యరహరి ప్రోగ్రాం లో చెప్పుకొచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: