
ఈ బిల్లు పైన ఏవైనా అభ్యంతరాలు ఉంటే 15 రోజుల్లోపు తెలియజేయాలంటూ కర్ణాటక ప్రభుత్వం కోరింది. ప్రేక్షకులకు సినిమా మరింత అందుబాటులో తీసుకురావాలనే విధంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలియజేశారు. గతంలో మల్టీప్లెక్స్ థియేటర్లు రూ .600 నుంచి ₹1000 వరకు ఉన్నాయని టికెట్ ధరలు అధికంగా ఉండడంతో సామాన్యులు ఎవరూ కూడా సినిమాలకు వెళ్లడానికి మక్కువ చూపు లేదంటూ తెలియజేసింది. అయితే ప్రభుత్వం తీసుకున్న ఈ బిల్లు పైన ఆటు ప్రజలు మాత్రం ఆనందాన్ని తెలియజేస్తూ ఉన్న సినీ పరిశ్రమ మాత్రం భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నాయి.
మరొకవైపు మల్టీప్లెక్స్ యాజమాన్యులు మాత్రం తమ ఆదాయం పైన చాలా దెబ్బ పడుతుందంటూ ఆందోళన చేస్తున్నారట. ఐమాక్స్, ఫోర్ డిఎక్స్ వాటి కోసం భారీగా పెట్టుబడులు పెడుతున్నామని అన్నిటికి ఒకే ధర నిర్ణయించడం వల్ల థియేటర్ల యాజమాన్యాలు నష్టాలు వాటిల్లుతాయంటూ తెలియజేస్తున్నారు. మరి ఈ విషయం పైన కర్ణాటక ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి మరి. అయితే ఇప్పటికే పాన్ ఇండియా లెవెల్లో సినిమాలంటూ చాలా భాషలలోని హీరోల సినిమాలు కూడా విడుదలవుతూ ఉన్నాయి. మరి ఇలాంటి సమయంలో సినిమా టికెట్ల రేట్ తగ్గింపు అనేది చర్చనీయాంశంగా మారింది. ఈ ఎఫెక్ట్ కచ్చితంగా సినిమా హీరోల రెమ్యూనరేషన్ పైన పడుతుందనే విధంగా వినిపిస్తున్నాయి. మరి ఏం జరుగుతుందో చూడాలి.