సినిమా ఇండస్ట్రీ లోకి ఎప్పుడు ఎంట్రీ ఇచ్చాము అన్నది కాదు ఎప్పుడు అదిరిపోయే రేంజ్ బ్లాక్ బాస్టర్ విజయాన్ని కొట్టాము అన్నది ముఖ్యం అని చాలా మంది అభిప్రాయపడుతూ ఉంటారు. ఎందుకు అంటే సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చాక చిన్న చిన్న సినిమాల్లో నటించినా అవి పెద్ద విజయాలను సాధించకపోయినట్లయితే వాటి ద్వారా నటీ నటులకు పెద్దగా క్రేజ్ రానట్లయితే ఆ సినిమాల ద్వారా వారికి పెద్దగా ఉపయోగం ఉండదు.

అదే వారు నటించిన చిన్న సినిమా అయినా , పెద్ద సినిమా అయినా బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన విజయాన్ని అందుకొని ఆ సినిమాలో వారి పాత్రకు మంచి గుర్తింపు వచ్చినట్లయితే ఆ సినిమాతో వారి కెరియర్ టర్ను తిరిగే అవకాశం ఉంటుంది. ఇక ఇలాంటి పరిస్థితినే  ఓ నటి ఎదుర్కొంది. అసలు విషయం లోకి వెళితే ...  తెలుగు సినీ పరిశ్రమలో నటిగా పర్వాలేదు అనే స్థాయి గుర్తింపును సంపాదించుకున్న వారిలో శాన్వీ మేఘన ఒకరు. ఈమె ఇప్పటివరకు సైరా నరసింహారెడ్డి , పిట్ట కథలు , బిలాస్పూర్ పోలీస్ స్టేషన్ , పుష్పక విమానం , మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాల్లో నటించింది. ఈ మూవీ ల ద్వారా ఈమెకు మంచి గుర్తింపు లభించింది. కానీ అద్భుతమైన క్రేజ్ మాత్రం ఈ సినిమాల ద్వారా ఈ నటికి దక్కలేదు. 

ఇలా తెలుగు లో చాలా సినిమాల్లో నటించిన ఈమెకు అదిరిపోయే రేంజ్ విజయాలు దక్కలేదు. ఆ తర్వాత ఈమె తమిళ సినిమాల్లో నటించడం మొదలు పెట్టింది. తాజాగా ఈ బ్యూటీ తమిళ్ లో కుటుంబస్థాన్‌ అనే సినిమాలో నటించింది. ఈ మూవీ కి అద్భుతమైన రీతిలో ప్రేక్షకాదరణ దక్కడంతో ఈ మూవీ ద్వారా ఈమెకి సూపర్ సాలిడ్ గుర్తింపు వచ్చింది. మరి రాబోయే రోజుల్లో ఈ బ్యూటీ ఎలాంటి సినిమాల్లో నటించి ఏ స్థాయి క్రేజ్ ను సంపాదించుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

Sm