తెలుగు , తమిళ్ భాషల్లో అద్భుతమైన నటుడిగా గుర్తింపును సంపాదించుకున్న వారిలో రఘువరన్ ఒకరు. ఈయన తన కెరీర్ లో ఎన్నో వైవిధ్యమైన పాత్రలలో నటించాడు. కానీ ఈయనకు విలన్ పాత్రల ద్వారా అద్భుతమైన గుర్తింపు వచ్చింది. రఘువరన్ తన కెరియర్ లో ఎన్నో సినిమాల్లో విలన్ పాత్రలలో నటించి తన నటనతో సినిమాను విజయవంతం చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. చాలా సంవత్సరాల క్రితం టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున హీరోగా రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో శివ అనే సినిమా వచ్చిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ లో రఘువరన్ ప్రతి నాయకుడి పాత్రలో నటించాడు.

ఈ సినిమాలో ఈయన నటన అద్భుతంగా ఉండడం , ఈ మూవీ కూడా సూపర్ సక్సెస్ కావడంతో ఈ మూవీ ద్వారా ఈయనకు తెలుగు లో విలన్ గా అద్భుతమైన గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత ఈయన ఎన్నో సినిమాల్లో విలన్ పాత్రలో నటించి గొప్ప గుర్తింపును సంపాదించుకున్నాడు. ఈయన కొన్ని సంవత్సరాల క్రితమే అనారోగ్య కారణంగా మరణించారు. ఇకపోతే రఘువరన్ భార్య కూడా ఓ నటి అనే విషయం మీకు తెలుసా.  ఈమె ఎన్నో తెలుగు మరియు తమిళ భాష సినిమాల్లో  నటించింది. ప్రస్తుతం ఈమె ఎక్కువ శాతం స్టార్ హీరోలకు తల్లి పాత్రలలో నటిస్తూ అద్భుతమైన జోష్లో కెరియర్ను ముందుకు సాగిస్తుంది. 

ఇంతకు ఆమె ఎవరో తెలుసా ..? ఆమె మరెవరో కాదు ప్రముఖ నటిమణి అయినటువంటి రోహిణి. చైల్డ్ ఆర్టిస్టుగా కెరియర్ను మొదలు పెట్టిన రోహిణి ఆ తర్వాత ఎన్నో తెలుగు , తమిళ సినిమాల్లో హీరోయిన్గా నటించింది. ప్రస్తుతం ఈమె స్టార్ హీరోలకు తల్లి పాత్రలో ఎక్కువగా నటిస్తూ కెరియర్ను అద్భుతమైన జోష్లో ముందుకు సాగిస్తోంది. ప్రస్తుతం రోహిణి వరుస అవకాశాలతో ఎంతో బిజీగా కెరియర్ను ముందుకు సాగిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: