కోట శ్రీనివాసరావు మరణించాక ఆయన గురించి తెలియని విషయాలు ఎన్నో బయటపడుతున్నాయి. ముఖ్యంగా ఆయనతో సన్నిహితంగా మెదిలిన చాలామంది కోట శ్రీనివాసరావు గారితో ఉన్న అనుభవాలను మరొక్కసారి నెమరు వేసుకుంటున్నారు.ఈ నేపథ్యంలోనే కోటా శ్రీనివాసరావుతో సన్నిహితంగా ఉన్న నటుడు అనగానే అందరికీ ముందుగా గుర్తుకు వచ్చేది బాబు మోహన్ మాత్రమే. బాబు మోహన్ కోట శ్రీనివాసరావు కాంబోలో వచ్చే కామెడీని చూసి ప్రేక్షకులు ఎంతగా నవ్వుకుంటారో చెప్పనక్కర్లేదు. అయితే అలాంటి కోట శ్రీనివాసరావు,బాబు మోహన్ కలిసి సినిమాల్లో చేసిన సమయంలో ఓ సీనియర్ నటి కోట శ్రీనివాసరావుకి గట్టి వార్నింగ్ ఇచ్చిందట. మరి ఇంతకీ అసలు విషయం ఏంటయ్యా అంటే..

కోటా శ్రీనివాసరావు మరణించాక ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న బాబు మోహన్ మాట్లాడుతూ.. నేను కోటన్న ఇద్దరం బొబ్బిలి రాజా సినిమా సమయంలో కలిసాము. ఆ తర్వాత మామగారు సినిమాతో మా మధ్య మంచి బంధం ఏర్పడింది.ఈ సినిమా తర్వాత మా ఇద్దరి కాంబో ని తీసుకోవడం స్టార్ట్ చేశారు. అయితే కోట శ్రీనివాసరావు నేను ఓ సినిమాలో చేస్తున్నప్పుడు కోటన్న నన్ను అప్పుడప్పుడు తిడుతూ ఉండేవారు. అయితే ఓసారి నన్ను కోటన్న తిట్టిన మాటలు విన్న సీనియర్ నటి వాణిశ్రీ కోటన్న పై ఫైర్ అయింది. ఏం మాటలు మాట్లాడుతున్నావ్..

సీనియర్ నటుడు అయినా కూడా ఆయనకు గౌరవం ఇవ్వకుండా మాట్లాడుతున్నావా అని తిట్టింది.అంతేకాదు సీనియర్ నటుడినే తిడుతున్నావ్ అంటే రేపు నన్ను కూడా తిడతావు..ఇంకొకసారి ఇలాంటి మాటలు మాట్లాడితే బాగుండదు అంటూ వార్నింగ్ ఇచ్చింది.ఇక వాణిశ్రీ గారు అలాంటి మాటలు మాట్లాడడంతో కోట శ్రీనివాసరావు  అప్పటినుండి నన్ను ఒక మాట కూడా అనలేదు. ముఖ్యంగా షూటింగ్స్ సెట్లో అందరి ముందు  ఎలాంటి మాటలు అనేవారు కాదు అంటూ ఓ షాకింగ్ విషయాన్ని బయట పెట్టారు బాబు మోహన్. అలా ఓ షూటింగ్ సెట్లో వాణిశ్రీ గారు ఇచ్చిన వార్నింగ్ తో కోట శ్రీనివాసరావు తన ప్రవర్తన మార్చుకున్నారని చెప్పుకొచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: