న్యాచుర‌ల్ స్టార్ నాని నిర్మించిన బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ `కోర్ట్‌` మూవీతో హీరోయిన్ గా ప‌రిచ‌య‌మైంది కాకినాడ శ్రీ‌దేవి. అంత‌క‌న్నా ముందు ప‌లు చిత్రాల్లో చిన్న చిన్న పాత్ర‌లు చేసిన‌ప్ప‌టికీ అంత‌గా గుర్తింపు రాలేదు. కానీ కోర్ట్ ద్వారా యూత్‌లో శ్రీ‌దేవి మంచి క్రేజ్ సంపాదించుకుంది. ఫ‌స్ట్ హిట్ తోనే ల‌గ్జ‌రీ కారును కొనుగోలు చేసింది. మ‌రోవైపు హీరోయిన్ గా త‌న రెండో సినిమాను త‌మిళంలో ప్రారంభించింది. కోలీవుడ్ ప్రొడ్యూస‌ర్ కేజేఆర్ హీరోగా న‌టిస్తున్న ఓ సినిమాలో శ్రీ‌దేవి ఫీమెయిల్ లీడ్‌గా ఎంపిక అయింది.


మినీ స్టూడియో సంస్థ ప్రొడ్యూస్ చేస్తున్న ఈ చిత్రానికి రెగన్ స్టానిస్లాస్ ద‌ర్శ‌కుడు. పూజా కార్య‌క్ర‌మాల‌తో రీసెంట్‌గా ఈ సినిమా స్టార్ట్ అయింది. ఇదిలా ఉంటే తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొన్న శ్రీ‌దేవి.. త‌న‌కొస్తున్న సినిమా ఆఫ‌ర్ల గురించి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసింది. నిజానికి కోర్ట్ త‌ర్వాత శ్రీ‌దేవికి చాలా అవ‌కాశాలు త‌లుపు త‌డుతున్నాయ‌ట‌. కానీ వ‌చ్చిన ప్ర‌తి సినిమాకు గ్రీన్ సిగ్న‌ల్ ఇస్తే బొక్క‌బోర్లా ప‌డ‌టం ఖాయం. ఈ విష‌యాన్ని ముందే గ్ర‌హించిన శ్రీ‌దేవి.. సెల‌క్టివ్ గా క‌థ‌లను ఎంపిక చేసుకుంటోంద‌ట‌.


ఎక్కువగా కాలేజీ లవ్ స్టోరీస్, యూత్ రొమాంటిక్ మూవీస్ లో ఆఫర్స్ వస్తున్నాయ‌ని.. ఒక‌రిద్ద‌రు తెలుగు యంగ్ హీరోల ప‌క్క‌న‌ నటించాలంటూ కూడా ఆఫర్స్ వచ్చాయని.. కానీ తానింకా చిన్న‌పిల్ల‌నే.. తనకు ఇప్పుడే అలాంటి సినిమాలు చేయాల‌ని లేద‌ని శ్రీ‌దేవి తెలిపింది. హీరోయిన్ అవ్వడం కోసమే ఇండస్ట్రీలోకి వచ్చాను. అయితే న‌ట‌న‌పై పూర్తి స్థాయిలో పట్టు సాధించాకే అన్ని రకాల పాత్రల్లో నటించాలని ఉందని.. అప్ప‌టివ‌ర‌కు వ‌య‌సుకు త‌గ్గా పాత్ర‌లే చేస్తాన‌ని శ్రీ‌దేవి చెబుతోంది. మొత్తానికి హ‌డావుడి ప‌డ‌కుండా ఈ యంగ్ బ్యూటీ కెరీర్ ప‌రంగా స్లో అండ్ స్ట‌డీగా వెళ్తోంద‌ని అర్థ‌మ‌వుతోంది.  


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: