తెలుగు సిరి పరిశ్రమలో నిర్మాతగా తనకంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకున్న వారిలో సూర్య దేవర నాగ వంశీ ఒకరు. ఈయన ఇప్పటికే సీతరా ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ఎన్నో సినిమాలను నిర్మించి వాటిలో ఎన్నో మూవీలతో మంచి విజయాలను అందుకొని టాలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ సాలిడ్ క్రేజ్ కలిగిన నిర్మాతగా కెరియర్ను కొనసాగిస్తున్నాడు. ఇకపోతే అనేక సందర్భాలలో అనేక మంది ఈ మధ్య కాలంలో సినిమా థియేటర్లకు ఎక్కువగా రావడం లేదు. అందుకు ప్రధాన కారణం కొన్ని థియేటర్లలో సినిమా టికెట్ ధర కంటే కూడా పాప్ కార్న్ , కూల్ డ్రింక్ ధరలు అత్యధికంగా ఉంటున్నాయి అని , కుటుంబం మొత్తంతో కలిసి సినిమాకు వెళితే సినిమా టికెట్ ధరలతో పాటు పాప్ కార్న్ , కూల్ డ్రింక్ లతో కలిపి బడ్జెట్ తడిసి మోపడుతుంది అని , దానితో సామాన్య , మధ్య తరగతి కుటుంబాల ప్రజలు థియేటర్ కి వెళ్లి సినిమాలు చూడడానికి అత్యంత ఇబ్బంది పడుతున్నారు అని కామెంట్స్ చేసిన వారు ఉన్నారు. తాజాగా నాగ వంశీ కొన్ని వ్యాఖ్యలు చేశాడు.

తాజాగా నాగ వంశీ థియేటర్లలో పాప్ కార్న్ మరియు కూల్ డ్రింక్ ధరలు చూసి నేను ఆశ్చర్య పోయాను అని చెప్పుకొచ్చారు. టికెట్ ధరల కంటే కూడా అవి ఎక్కువగా ఉంటున్నాయి అని , అలాగే అవి ఎంతో భారంగా మారుతున్నాయి అని ఆయన వ్యాఖ్యానించారు. ఈ ధరల నియంత్రణ అనేది నిర్మాత చేతుల్లో అస్సలు లేదు అని , ప్రభుత్వాలు ఆ దిశగా రూల్ తీసుకువస్తే థియేటర్ల యాజమాన్యాలు కూడా వింటాయి అని ఆయన ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. ఇది ఇలా ఉంటే నాగ వంశీ తాజాగా కింగ్డమ్ అనే సినిమాను రూపొందించాడు. విజయ్ దేవరకొండ హీరోగా రూపొందిన ఈ సినిమాను జూలై  31 వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ మూవీ తో నిర్మాతగా నాగ వంశ కి ఏ స్థాయి విజయం దక్కుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: