
తేజ సజ్జ ప్రస్తుతం కార్తీక్ ఘట్టమనేని డైరెక్షన్లో మిరాయ్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది సెప్టెంబర్ నెల ఐదవ తేదీన ఈ సినిమా థియేటర్లలో విడుదల కావాల్సి ఉంది. ఈ సినిమా నాన్ థియేట్రికల్ హక్కులు ఏకంగా 55 కోట్ల రూపాయలకు అమ్ముడు అయ్యాయని సమాచారం. ప్రముఖ ఓటిటిలలో ఒకటైన డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఈ హక్కులను కొనుగోలు చేసిందని ఇండస్ట్రీ వర్గాల సమాచారం.
టాలీవుడ్ ఇండస్ట్రీలో టైర్ వన్ హీరోలు మినహా మరే హీరో సినిమాలు ఈ స్థాయిలో పలకవు. వరుస విజయాలతో తేజ సజ్జ మార్కెట్ ను పెంచుకోవడంతో ఈ సినిమాకు ఊహించని స్థాయిలో బిజినెస్ జరిగిందని కచ్చితంగా చెప్పవచ్చు. మిరాయ్ సినిమా థియేటర్ హక్కులకు సైతం మంచి డిమాండ్ నెలకొంది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కుతుండగా మంచు మనోజ్ ఈ సినిమాలో విలన్ గా నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్ కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా 2025 బిగ్గెస్ట్ హిట్లలో ఒకటిగా నిలిచే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయని చెప్పడంలో ఎలాంటి సందేహం అవసరం లేదు.
త్వరలో ఈ సినిమాకి సంబంధించి క్రేజీ అప్డేట్స్ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. అయితే ఈ సినిమా సిజి పనులు అనుకున్న సమయానికి పూర్తయితే మాత్రమే సెప్టెంబర్ నెలలో ఈ సినిమా విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. ఆ తేదీకి ఘాటి సినిమాతోపాటు రష్మిక నటించిన గర్ల్ ఫ్రెండ్ సినిమా కూడా విడుదలయ్యే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. ఈ మధ్యకాలంలో భారీ బడ్జెట్ సినిమాలు సైతం ఇతర సినిమాలతో పోటీపడి విడుదల కావాల్సిన పరిస్థితి నెలకొంది.