మన తెలుగు సినిమా పరిశ్రమలో మంచి క్రేజ్ ఉన్న హీరోలలో ప్రతి సంవత్సరం ఎక్కువ సినిమాలతో ప్రేక్షకులను పలకరించే వారిలో దాదాపుగా నాని ముందు వరసలో ఉంటాడు. నాని హిట్ ... ఫ్లాప్ లతో సంబంధం లేకుండా కనీసం సంవత్సరానికి ఒకటి లేదా రెండు సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తూ ఉంటాడు. వీలైతే ఆయన మూడు సినిమాలను కూడా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. ఈయనతో సరి సమానంగా కెరియర్ కొనసాగిస్తున్న చాలా మంది హీరోలు ఇలా సంవత్సరానికి కనీసం ఒకటి , రెండు వీలైతే మూడు సినిమాలను తీసుకురావడంలో చాలా వరకు వెనకబడిపోతూ వస్తున్నారు.

ఒకానొక ఇంటర్వ్యూలో భాగంగా నాని మాట్లాడుతూ ఆయన అత్యంత వేగంగా సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకోరావడానికి గల సీక్రెట్ ను రివిల్ చేశాడు. ఒక ఇంటర్వ్యూలో భాగంగా నాని మాట్లాడుతూ ... నేను కనీసం సంవత్సరానికి రెండు సినిమాలు అయినా ప్రేక్షకులం ముందుకు తీసుకురావడానికి ప్రయత్నిస్తూ ఉంటాను. నేను సంవత్సరానికి ఒకటి , రెండు సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి నా దగ్గర ఉన్న సీక్రెట్ ఏమీ లేదు ... కాంబినేషన్లను నమ్మకోకపోవడమే. పలానా దర్శకుడితో కచ్చితంగా సినిమా చేయాలి అని వెయిట్ చేస్తూ ఉంటే సంవత్సరానికి మనం ఒకటి , రెండు సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకురాలేము.

అదే మన దగ్గరికి వచ్చిన కథల్లో మంచి కథలను ఎంచుకొని , దర్శకుడు కొత్త వాడ , పాత వాడ అని ఆలోచించకుండా ఏ దర్శకుడి గురించి వెయిట్ చేయకుండా సినిమాలు చేస్తూ వెళితే కచ్చితంగా సంవత్సరానికి ఒకటి , రెండు సినిమాలను మనం ప్రేక్షకుల ముందుకు తీసుకురాగలం ... నేను అదే ఫార్ములాను ఫాలో అవుతూ వస్తున్నాను అని నాని చెప్పుకొచ్చాడు. నా దగ్గరికి ఏ దర్శకుడు అయిన కథతో వస్తే ఆ కథ బాగుండి ... ఆ దర్శకుడు సినిమాను బాగా తీయగలడు అనే నమ్మకం నాకు కలిగితే అతనితో నేను సినిమా చేస్తాను. అందుకే నేను సంవత్సరానికి కనీసం ఒకటి , రెండు సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకు రాగలుగుతున్నాను అని నాని ఓ ఇంటర్వ్యూలో భాగంగా చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: