"సమంత".. ఇండస్ట్రీలో ఓ స్టార్ హీరోయిన్ . అంతేకాదు ఆమెను చాలామంది ఉమెన్స్,  గర్ల్స్ ఇన్స్పిరేషన్ గా తీసుకుంటూ ఉంటారు.  ఎటువంటి సపోర్ట్ లేకుండా తన కాళ్లపై తాను నిలబడడానికి ఆమె పడిన శ్రమ పడుతున్న కష్టం అందరికీ తెలిసిందే. సినిమాలోకి వస్తాము అంటే తల్లిదండ్రులు కూడా ఎంకరేజ్ చేయలేదు . కానీ ఆమె తాను ఏంటో ప్రూవ్ చేసుకోవడానికి ఇండస్ట్రీలోకి వచ్చింది . తనదైన స్టైల్ లో నటించి మెప్పించి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది . నలుగురికి ఆదర్శప్రాయంగా నిలిచింది , కాగా సమంత లైఫ్ లో పాజిటివ్ యాంగిల్ ఉన్నట్టే నెగిటివ్ యాంగిల్ కూడా ఉంది .


సమంత మంచి మంచి సినిమాల కధలని చూస్ చేసుకొని స్టార్ హీరోయిన్గా మారింది.  అయితే సమంత - నాగచైతన్య ప్రేమించి పెళ్లి చేసుకొని ఆ తర్వాత విడాకులు ఇచ్చేసి నెగిటివ్ కామెంట్స్ కూడా దక్కించుకుంది.  ఇవన్నీ పక్కనపెడితే సమంత రెండో పెళ్లి వార్త ఇప్పుడు సెన్సేషనల్ గా మారింది. హీరోయిన్ సమంత డైరెక్టర్ రాజ్ నిడమూరుతో రిలేషన్షిప్ లో ఉంది అన్న వార్తలు బాగా ట్రెండ్ అవుతున్నాయి . దానికి తగ్గట్టే వీరిద్దరూ కలిసి తిరిగిన ఫోటోలు బాగా వైరల్ గా కూడా మారాయి.



కాగా రీసెంట్ గానే ఒక పిక్ వీళ్ళిద్దరి మధ్య ప్రేమను కన్ఫామ్ చేసేసినట్లయింది. చాలా చనువుగా ఉన్న పిక్ సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అయ్యింది.  అంతేకాదు ఇప్పుడు సోషల్ మీడియాలో రాజ్ నిడమూరు ను సమంత ఎప్పుడు పెళ్లి చేసుకోబోతుంది అన్న వార్త కూడా ట్రెండ్ అయిపోతుంది . అక్టోబర్ 6 సమంత - నాగచైతన్య పెళ్లి జరిగింది. అయితే ఇప్పుడు అదే తేదీన తన రెండో పెళ్లి కూడా చేసుకోవడానికి సమంత పక్క ప్లాన్ తో ముందుకు వెళుతుంది అంటూ ఓ న్యూస్ బాగా వైరల్ గా మారింది.  వైరల్ అవుతున్న న్యూస్ ప్రకారం ఈ మూహుర్తం ఆల్ మోస్ట్ ఆల్ ఫిక్స్ అంటూ తెలుస్తుంది.  అక్టోబర్ ఆరవ తేదీ నా చాలా సింపుల్ గా చర్చ్ లోనే ఈ పెళ్లి జరగబోతుంది అంటూ తెలుస్తుంది. సోషల్ మీడియాలో ఇప్పుడు ఇదే న్యూస్ బాగా వైరల్ అవుతుంది. చూద్దాం మరి ఏం జరుగుతుందో..???

మరింత సమాచారం తెలుసుకోండి: