సినిమా ఇండస్ట్రీ లో అదిరిపోయే రేంజ్ క్రేజ్ ఉన్న హీరోయిన్లకు హీరోలతో సరి సమానమైన పారితోషకాలు అందతూ ఉంటాయి. అద్భుతమైన క్రేజ్ ఉన్న హీరోలతో సరి సమాన పారితోషకం హీరోయిన్లు తీసుకోవాలి అంటే వారికి ఒకటి , రెండు విజయాలు ఉంటే సరిపోదు. వారు అద్భుతమైన విజయాలను అందుకొని ఉండాలే. అలాగే వారు నటనతో , తమ అందాలతో ప్రేక్షకులను ఆకట్టుకోగలగాలి. అలాగే స్టార్ హీరోయిన్ రేంజ్ లో కొనసాగుతూ ఉండాలి. అలాగే ఆ ముద్దుగుమ్మ కోసం చాలా మంది సినిమాకు రావాలి. ఇంతటి స్థాయి ఉన్న హీరోయిన్లకు మాత్రమే మంచి క్రేజ్ ఉన్న హీరోలతో సరి సమాన పారితోషకాలు దక్కుతూ ఉంటాయి.

ఆ స్థాయి క్రేజ్ ఉన్న నటీమణులలో దీపికా పదుకొనే ఒకరు. ఈమె చాలా సంవత్సరాల క్రితం నటిగా కెరియర్ను మొదలు పెట్టింది. ఇప్పటికే ఈమె ఎన్నో సినిమాల్లో నటించింది. బాలీవుడ్ ఇండస్ట్రీ లో ఈమె స్టార్ హీరోయిన్గా కెరియర్ను కొనసాగిస్తుంది. ఇది ఇలా ఉంటే ఈమె ఒక్కో సినిమాకు పెద్ద మొత్తంలో పారితోషకం అందుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈమెకు అదిరిపోయే రేంజ్ క్రేజ్ ఉండడంతో నిర్మాతలు కూడా ఆమెకు అడిగినంత ఇస్తూ సినిమాల్లో పెట్టుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈమె పారితోషకం మాత్రమే కాదు ఈమె బాడి గార్డ్ జీతం కూడా అదిరిపోయే రేంజ్ లో ఉందని తెలుస్తోంది. 

దీపికా పదుకొనే బాడీ గార్డ్ పేరు  జలాలుద్దీన్. ఈయన కేవలం దీపికా కు బాడీ గార్డ్ మాత్రమే కాదని అన్నతో సమానమైన వ్యక్తి అని తెలుస్తుంది. ఇక ఇతనికి జీతం వచ్చేసి 80 లక్షల నుండి 1.2 కోట్ల వరకు ఉంటుంది అని వార్తలు వస్తున్నాయి. ఇలా దీపికా పదుకొనే బాడీ గార్డ్ జీవితం అదిరిపోయే రేంజ్ లో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం దీపిక పదుకొనే ,  అల్లు అర్జున్ హీరోగా అట్లీ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Dp