కొంత మంది నటీమణులు సినిమా కోసం ఎంతైనా కష్టపడడానికి రెడీగా ఉంటారు. వారు సినిమా కోసం కష్ట పడడం మాత్రమే కాకుండా సినిమా పూర్తి అయిన తర్వాత ఆ మూవీ ని జనాల్లోకి తీసుకెళ్లేందుకు ప్రమోషన్ల విషయంలో అత్యంత కష్టపడుతూ ఉంటారు. మూవీ యూనిట్ ఏ ప్రమోషనల్ ఈవెంట్ను ఏర్పాటు చేసిన దానికి అటెండ్ కావడం , అందులో చురుగ్గా పాల్గొంటూ సినిమాను మరింత జనాల్లోకి తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఇలా అనేక మంది నటీమణులు తాము నటించిన సినిమాలను జనాల్లోకి తీసుకెళ్లడానికి అద్భుతమైన రీతిలో ప్రయత్నించిన సందర్భాలు అనేకం ఉన్నాయి.

తాజాగా మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ టాలెంటెడ్ నటిమని నిధి అగర్వాల్ కూడా ఈ లిస్ట్ లోకి చేరింది. తాజాగా ఈ బ్యూటీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా జ్యోతి కృష్ణ దర్శకత్వంలో రూపొందిన దారి హర వీరమల్లు అనే సినిమాలో హీరోయిన్గా నటించింది. ఈ మూవీ ని జూలై 24 వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో నిధి అగర్వాల్ అదిరిపోయే రేంజ్ లో ఈ సినిమా ప్రమోషన్లలో పాల్గొంటూ వస్తుంది. తాజాగా ఈ బ్యూటీ కేవలం ఒకే రోజుల్లో 8 గంటల వ్యవధి లోనే ఏకంగా 15 ఇంటర్వ్యూ లలో పాల్గొంది. ఏక ధాటిగా ఎనిమిది గంటల్లో కేవలం అర్ధ గంట మాత్రమే రెస్టు తీసుకొని ఒక్కో చానల్ కి అర్ధ గంట చొప్పున 15 ఇంటర్వ్యూలను ఈ బ్యూటీ ఒక్క రోజు లోనే 15 ఇంటర్వ్యూ లను ఇచ్చినట్టు తెలుస్తోంది.

ఇలా సినిమా కోసం ఈ రేంజ్ లో కష్టపడుతున్న ఈ బ్యూటీ ని చూసి డేడికేషన్ అంటే ఇలా ఉండాలి. సినిమా కోసం ఈ రేంజ్ లో కష్టపడే హీరోయిన్లు దొరకడం కూడా చాలా అరుదు అని కొంత మంది అభిప్రాయ పడుతున్నారు. ఇకపోతే ఈ సినిమా కనుక మంచి విజయం సాధిస్తే నిధి అగర్వాల్ క్రేజ్ తెలుగులో భారీ గా పెరిగే అవకాశం చాలా వరకు ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Na