తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకున్న యువ నటులలో విజయ్ దేవరకొండ ఒకరు. ఈయన తాజాగా కింగ్డమ్ అనే సినిమాలో హీరోగా నటించిన విషయం మనకు తెలిసిందే. భాగ్య శ్రీ బోర్స్ ఈ మూవీ లో హీరోయిన్గా నటించగా ... గౌతమ్ తిన్ననూరి ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత సూర్య దేవర నాగ వంశీ నిర్మించిన ఈ మూవీ కి అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందించాడు. ఈ మూవీ ని జూలై 31 వ తేదీన తెలుగు , తమిళ్ , హిందీ భాషల్లో విడుదల చేయనున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుండి మేకర్స్ విడుదల చేసిన ప్రచార చిత్రాలు జనాలను బాగా ఆకట్టుకున్నాయి.

దానితో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొని ఉన్నాయి. ఇది ఇలా ఉంటే వరుసగా విజయ్ ఈ మధ్య కాలంలో నటించిన చాలా సినిమాలు బాక్సా ఫీస్ దగ్గర బోల్తా కొట్టాయి. దానితో కింగ్డమ్ సినిమాతో కచ్చితంగా విజయ్ మంచి విజయాన్ని అందుకొని అదిరిపోయే రేంజ్ కం బ్యాక్ ఇస్తాడు అని ఆయన అభిమానులు గట్టిగా నమ్ముతున్నట్లు తెలుస్తోంది. కింగ్డమ్  సినిమా విడుదల దగ్గర పడిన టైమ్ లో విజయ్ డెంగ్యూ జ్వరంతో హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు. ఆయన హాస్పటల్ నుండి నిన్న అనగా జూలై 20 వ తేదీన డిశ్చార్జ్ అవుతారు అని వార్తలు వచ్చాయి.

డెంగ్యూ బారిన పడి ప్రస్తుతం ఆరోగ్యం అంతగా బాగా లేకపోయినా కింగ్డమ్ సినిమా కోసం ప్రమోషన్లలో పాల్గొనాలి అని విజయ్ భావిస్తున్నట్లు , అందులో భాగంగా ఆయన అనేక ఇంటర్వ్యూలలో , పబ్లిక్ ఈవెంట్లలో కూడా పాల్గొనబోతున్నట్లు తెలుస్తోంది. ఇలా డెంగ్యూ బారిన పడి కోల్కున్న వెంటనే సినిమా ప్రమోషన్లలో పాల్గొనాలి అనే ఆలోచనకు విజయ్ రావడంతో ఆయన అభిమానులు ఎంతో ఆనంద పడుతున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Vd