"ఉపాసన".. ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయాలు చేయాల్సిన అవసరమే లేదు . ఇండస్ట్రీలో ఓ బిగ్ హీరోయిన్ కాదు. కానీ సోషల్ మీడియాలో హీరోయిన్ కి మించిన రేంజ్ లోనే ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది . మరి ముఖ్యంగా ఉపాసన గురించి ఒక్కరంటే ఒక్కరు కూడా నెగిటివ్ గా మాట్లాడరు. మంచితనానికి మరో మారుపేరు ఉపాసన అంటూ అందరూ పొగిడేస్తూ  ఉంటారు.  దానికి కారణం ఆమె చేసే మంచి పనులు . ఆ మంచి పనులు నలుగురితో పంచుకోవడంతో ఇంకా అందరికీ మంచి జరుగుతుంది అని భావిస్తూ ఉంటుంది.


మరి ముఖ్యంగా ఉమెన్స్ కి ఎలాంటి ఫ్రీడమ్ కావాలి.. ఉమెన్స్ ఎలా హెల్త్ పట్ల జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాలను సోషల్ మీడియా వేదికగా ఎప్పటికప్పుడు తెలియజేస్తూనే ఉంటుంది . కాగా  అలాంటి ఉపాసన బర్త డే సందర్భంగా ఆమె భర్త రామ్ చరణ్ ఇచ్చిన సర్ప్రైజ్ అందరిని ఆశ్చర్యపరుస్తుంది . చరణ్ బెస్ట్ హాఫ్ ఉపాసన కొణిదెల బర్త డే రావడంతో  మెగా ఇంట సందడి వాతావరణం నెలకొంది . ఈ స్పెషల్ డే ని రామ్ చరణ్ మరింత స్పెషల్ గా మార్చేశాడు. తమ ఇంట్లో మంచి డెకరేషన్ క్రియేట్ చేసి ఉపాసన బర్త్డ డే ని చాలా సింపుల్ గా బ్యూటిఫుల్ గా సెలబ్రేట్ చేశారు .



మరీ ముఖ్యంగా తనకి ఎంతో ఇష్టమైన క్లిం కార తో చాలా స్పెషల్ గా ఈ బర్త డే ని సెలబ్రేట్ చేసుకున్నింది ఉపాసన . దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి . అయితే రామ్ చరణ్ - ఉపాసనకి వేల కోట్ల ఆస్తి ఉంది.  వాళ్ళు అనుకుంటే ఏ ఫారిన్ కంట్రీస్ లోనో.. వేరే పెద్ద రిసార్ట్ లోనో.. లక్షలకి లక్షలు ఖర్చుచేసి గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకోవచ్చు. కానీ సింపుల్ గా కుటుంబ సభ్యుల మధ్యలో ఉపాసన తన బర్త డేని  సెలబ్రేట్ చేసుకోవడం అందరికీ ఆశ్చర్యకరంగా అనిపిస్తుంది. ఎంత ఎదిగిన ఒదిగి ఉండాలి అని చెప్పడానికి మెయిన్ ఎగ్జాంపుల్ ఉపాసననే అంటూ తెగ పోగిడేస్తున్నారు.  ముఖం రివీల్ చేయప్పటికీ క్లింకారా ఈ పిక్ లో హైలైట్ గా నిలిచింది.  రామ్ చరణ్ హెయిర్ స్టైల్ అట్రాక్టివ్ గా అనిపించింది.  ఉపాసన చాలా సింపుల్ గా వెస్ట్రన్ దుస్తుల్లో మెరిసింది.  ప్రెసెంట్ సోషల్ మీడియాలో ఈ న్యూస్ బాగా వైరల్ గా మారింది..!

మరింత సమాచారం తెలుసుకోండి: