పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు చిత్రానికి సంబంధించి నిన్నటి రోజున హైదరాబాదులో చాలా గ్రాండ్గా ప్రీ రిలీజ్ ఈవెంట్ ని చిత్ర బృందం నిర్వహించింది. ఇందులో పవన్ కళ్యాణ్ చాలా ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు. ముఖ్యంగా తన సినీ కెరియర్ గురించి మాట్లాడుతూ ఎమోషనల్ గా మాట్లాడడం జరిగింది. తాను 10 ఏళ్ల పాటు ఫ్లాపులలో ఉన్నానని.. మొదట్లో వరుస హిట్లు కొడుతున్నప్పుడు ఒక ఫ్లాప్ మూవీ చేసి పాపం చేశానని.. అప్పటినుంచి సినిమాల పైన గ్రిప్ కోల్పోయానంటు తెలిపారు.


ఎలాంటి స్క్రిప్ట్ ఎంచుకోవాలో ఆ సమయంలో తనకి అర్థం కాలేదని వరుసగా ఫ్లాప్ లో వచ్చాయి. ఆ సమయంలో తనకోసం నిలబడింది త్రివిక్రమ్ మాత్రమే.. మనం ఆపదలో ఉన్నప్పుడు వచ్చిన వాడే తనకు నిజమైన స్నేహితుడు అంటూ అప్పటివరకు అతనెవరో కూడా నాకు తెలియదని.. కానీ తామిద్దరం కలిసి జల్సా సినిమా చేసాము.. ఎవరైనా సక్సెస్ లో ఉన్నారంటేనే వెతుక్కుంటూ వస్తారు. కానీ ప్లాపులలో ఉన్న వెతుక్కుంటూ వచ్చిన నా మిత్రుడు, నా ఆత్మబంధువు త్రివిక్రమ్ లాంటి వ్యక్తిని స్నేహితుడిగా ఆ భగవంతుడే నాకు పంపించారంటూ తెలిపారు.


నాకు పెద్ద డైరెక్టర్లు లేరు అందుకే తాను ఎక్కువగా రీమిక్స్ సినిమాలు చేస్తున్నానని.. ఒకవేళ కొత్త సినిమాలు చేసి ఫ్లాపులు అయ్యాయి అంటే తనని నమ్ముకున్న వారి పరిస్థితి ఏంటి? తన పార్టీని నడిపించాలి, కుటుంబాలను కూడా పోషించాలని అలాగే నిర్మాతలను కూడా కాపాడుకోవాల్సి ఉంటుంది.. అందుకే రీమిక్ లు చేస్తేనే కొంతమేరకు డబ్బులు వస్తాయని ఆశించాను అందుకే చేశానని తెలిపారు పవన్ కళ్యాణ్. మొదటిసారి పవన్ కళ్యాణ్ ఇలా త్రివిక్రమ్ గురించి మాట్లాడడం చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. మరో రెండు రోజులలో విడుదల కాబోతున్న హరిహర వీరమల్లు సినిమా ఎలా ఉండబోతుందో చూడాలి మరి. పాన్ ఇండియా లేవల్లో రిలీజ్ చేయబోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: