జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఏ విషయం గురించి స్పందించినా ఆ కామెంట్లు సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అవుతుంటాయి. మనకు పెద్ద దర్శకులు లేరని రీమేక్ చేస్తే వీడితో పనైపోతుందని పార్టీని నడపడానికి రీమేక్ అనేది నాకు సులువైన దారి అయిందని పవన్ చెప్పుకొచ్చారు. అయితే ఈ కామెంట్లను ఆయన అభిమానులు మాత్రం అస్సలు నమ్మడం లేదు.

ఎందుకంటే స్టార్ డైరెక్టర్ రాజమౌళి ఒకానొక సమయంలో  పవన్ తో సినిమా తీయాలని ప్రయత్నించినా ఆ ప్రయత్నాలు వర్కౌట్ కాలేదు.  దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ పవన్ డేట్లు అందుబాటులో లేకపోవడంతో కొన్ని సందర్భాల్లో ఇతర హీరోలతో సినిమాలను తెరకెక్కించాల్సిన పరిస్థితి ఎదురైంది.  పవన్ డేట్స్ ఇస్తే  సినిమా తెరకెక్కించడానికి  సుకుమార్ సైతం సిద్ధంగా ఉంటారనే సంగతి తెలిసిందే.

పవర్ స్టార్  పవన్ కళ్యాణ్ తో సినిమా తెరకెక్కించాలని దర్శకుడు బోయపాటి శ్రీను సైతం కలలు  కంటున్నారు. బాబీ ఇప్పటికే పవన్ తో ఒక సినిమాను  తెరకెక్కించగా పవన్ తో సినిమా చేయాలని కోరుకునే డైరెక్టర్లలో  గోపీచంద్ మలినేని ముందువరసలో ఉంటారు.  హరీష్  శంకర్  పవన్ కు వీరాభిమాని అనే సంగతి తెలిసిందే. పవన్ కోరితే సినిమాను తెరకెక్కించడానికి హరీష్ శంకర్ ఎప్పుడూ  సిద్ధంగా ఉంటారు.

ప్రస్తుతం పవన్ హరీష్ శంకర్ కాంబినేషన్లో  ఉస్తాద్ భగత్ సింగ్  సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.  ప్రశాంత్ నీల్, నెల్సన్ దిలీప్ కుమార్,  లోకేష్  కనగరాజ్, కొరటాల శివ మరి కొందరు డైరెక్టర్లు  సైతం  పవన్ డేట్స్ ఇస్తే సినిమా చేయడానికి సిద్ధంగా ఉంటారు.  స్టార్ డైరెక్టర్లు పవన్ కు ఎప్పుడూ  దూరంగా లేరని  కామెంట్లు వినిపిస్తున్నాయి.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: