
రీసెంట్ గానే ప్రెస్ మీట్ పెట్టి సినిమా పై హై ఎక్స్పెక్టేషన్స్ పెంచేశారు హరిహర వీరమల్లు మూవీ టీం. అంతేకాకుండా ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా చాలా సింపుల్ గానే సక్సెస్ఫుల్ గా ముందుకు తీసుకెళ్లారు. దీంతో హరిహర వీరమల్లు సినిమా గురించి ప్రతి ఒక్కరు మాట్లాడుకుంటున్నారు. ఇలాంటి మూమెంట్ లోనే సినిమాకి సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ తెరపైకి వచ్చింది . ఈ సినిమాలో స్పెషల్ సర్ప్రైజ్ ఉండబోతుంది మెగా ఫ్యాన్స్ కి అన్న వార్త ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతుంది. హరిహర వీరమల్లు సినిమాలో పవన్ కళ్యాణ్ తో పాటు మెగాస్టార్ చిరంజీవి కూడా కనిపించబోతున్నారట .
అయితే ఆయన ఈ సినిమాలో యాక్ట్ చేయలేదు కానీ ఆయన సినిమాకి సంబంధించిన కొన్ని డైలాగ్ క్లిప్స్ ను ఈ సినిమాలో ఉపయోగించారట మూవీ మేకర్స్ . పూర్తిగా చిరంజీవి పర్మిషన్ తీసుకున్నకే ఈ విధంగా చేశారట . ఈ విషయాన్ని ఇప్పటి వరకు బయటకు చెప్పకపోవడానికి కారణం మెగా ఫాన్స్ కి సర్ప్రైజ్ ఇవ్వడానికి అంటూ తెలుస్తుంది . థియేటర్స్ లోనే ఆ డైలాగ్ ఏంటి అన్న విషయాన్ని తెలుసుకొని ఎంజాయ్ చేయాలి అనే కారణంగా ఇప్పటివరకు ఈ సీన్ కి సంబంధించి ఏ న్యూస్ ని బయటకు రానివ్వలేదు అంటూ తెలుస్తుంది .
ఇది తెలుసుకున్న అభిమానులు ఫుల్ సర్ప్రైజ్ అయిపోతున్నారు. హరిహర వీరమల్లు లాంటి సినిమాల్లో పవన్ కళ్యాణ్ తో పాటు చిరంజీవి నటించిన సినిమా డైలాగ్స్ కూడా వింటే గూస్ బంప్స్ పక్క అంటూ సినిమాని థియేటర్స్ చూడడానికి వెయిట్ చేస్తున్నామంటూ కామెంట్స్ చేస్తున్నారు . అప్పుడెప్పుడో "శంకర్ దాదా జిందాబాద్" సినిమాలో పవన్ కళ్యాణ్ - చిరంజీవిని కలిసి కొన్ని సెకండ్ల పాటు తెర పై కనిపించారు. ఇప్పుడు మళ్లీ ఇన్నాళ్ళకి "హరిహర వీరమల్లు" సినిమాలో చూడబోతున్నాం అంటూ సినిమాని బాగా ప్రమోట్ చేస్తున్నారు . మరి చిరంజీవి చెప్పిన డైలాగ్ ఏంటి..? డైరెక్టర్ దాన్ని ఎలా మ్యాచ్ అయ్యేలా..? సెట్ చేశాడు అనే విషయాలు తెలియాలి అంటే హరిహర వీరమల్లు సినిమా థియేటర్స్ రిలీజ్ అయ్యే వరకు వెయిట్ చేయాల్సిందే.
ఈ సినిమా జూలై 24వ తేదీ గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది . అయితే జూలై 23 రాత్రి 9:30 నిమిషాల నుంచి ప్రీమియర్స్ వేసుకోవడానికి గవర్నమెంట్ అంగీకారం తెలిపింది . దీంతో జులై 23 రాత్రి 9:30 నిమిషాలకు తెలుగు రెండు రాష్ట్రాలలో ప్రీమియర్స్ పడబోతున్నాయి..!!