పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన సమయం రానే వచ్చింది. `హరి హర వీరమల్లు` రిలీజ్ కు కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. పవన్ కెరీర్ లో తొలి పీరియాడిక్ యాక్షన్ ఫిల్మ్‌ ఇది. క్రిష్‌ జాగర్లమూడి, జ్యోతి కృష్ణ డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని ఏఎం రత్నం హై బడ్జెట్ తో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. నిధి అగర్వాల్ హీరోయిన్ కాగా.. బాబీ డియోల్ విలన్ గా యాక్ట్ చేశారు.


భారీ అంచనాల నడుమ జూలై 24న పాన్ ఇండియా స్థాయిలో వీరమల్లు చిత్రం విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ మూవీ వరల్డ్ వైడ్ ప్రీ రిలీజ్ బిజినెస్ లెక్కలు తెరపైకి వచ్చాయి. పవన్ కళ్యాణ్ కు ఉన్న క్రేజ్ మరియు సినిమాపై ఏర్పడిన సాలిడ్ హైప్ తో హరిహర వీరమల్లు మంచి బిజినెస్ సొంతం చేసుకుంది. నైజాం ఏరియాలో మైత్రి మూవీస్ వారు సినిమాను రిలీజ్ చేస్తున్నారు. నైజం బిజినెస్ వాల్యూ రూ. 37 కోట్లకు కన్ఫామ్ అయ్యింది.


అలాగే ఏపీ మరియు తెలంగాణలో వీరమల్లు చిత్రం రూ. 103.50 కోట్ల రేంజ్‌లో ప్రీ రిలీజ్ బిజినెస్ ను సొంతం చేసుకుంది. ఓవర్సీస్ లో రూ. 10 కోట్లకు థియేట్రిక‌ల్‌ రైట్స్ అమ్ముడుపోయాయి. కర్ణాటక, రెస్టాఫ్ ఇండియా మరియు ఇతర భాషల్లో పవన్ మూవీకి రూ. 12.50 కోట్ల రేంజ్ లో బిజినెస్ జరిగింది. ఇక వరల్డ్ వైడ్ గా హరిహర వీరమల్లు టోటల్ ప్రీ రిలీజ్ బిజినెస్ రూ. 126 కోట్లు. బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 127.50 కోట్లు. మరి ఈ కొండంత టార్గెట్ ను పవన్ రీచ్ అవుతాడా? లేదా? అన్నది తెలియాలంటే సినిమా టాక్ బయటకు వచ్చేవరకు వెయిట్ చేయాల్సిందే.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: