
అయితే చాలా మందికి తెలియని విషయం ఏంటంటే.. రాజా ది గ్రేట్ కు ఫస్ట్ ఛాయిస్ రవితేజ కాదు. ఈ బ్లాక్ బస్టర్‌ను ఓ టాలీవుడ్ హీరో మిస్ చేసుకున్నాడు. ఆ అన్ లక్కీ హీరో ఎవరో కాదు రామ్ పోతినేని. ఓ అమ్మాయిని కాపాడే బ్లైండ్ కుర్రాడి కథే రాజా ది గ్రేట్. కానీ మొదట అనుకున్న స్టోరీ వేరు. అందులో ఓ ప్రేమ కథ ఉంటుంది. ఓ అమ్మాయితో బ్లైండ్ అయిన హీరో లవ్ లో పడ్డ తర్వాత.. ఆ అమ్మాయికి ఎదో సమస్య వస్తే అతను అది ఎలా సాల్వ్ చేశాడు అనేది మొదట అనుకున్న కథ. హీరోగా రామ్ పోతినేని కన్ఫార్మ్ అయ్యాడు.
అయితే కొన్ని టెక్నీకల్ ఇష్యుస్ వల్ల ఆ ప్రాజెక్ట్ డిలే అయింది. ఈ గ్యాప్ లోనే కథలో అనిల్ రావిపూడి మార్పులు కూడా చేశాడు. అన్ని సెట్ అయ్యేలోపు రామ్ పోతినేని `హైపర్` సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు. మళ్లీ వెంటనే మరో కమర్షియల్ మూవీ చేసేందుకు ఆయన వెనకడుగు వేశాడు. ఆ కారణంగానే రాజా ది గ్రేట్ కు సున్నితంగా నో చెప్పాడు. దాంతో అనిల్ రావిపూడి మరో ఆలోచన లేకుండా రవితేజ వద్దకు వెళ్లి స్టోరీ చెప్పి ఒప్పించాడు. కట్ చేస్తే సినిమా భారీ విజయాన్ని నమోదు చేసింది.