సినిమా ఇండస్ట్రీ లో విజయాలు ఉంటేనే సూపర్ సాలిడ్ క్రేజీ సినిమాలలో అవకాశాలు దక్కుతాయి అనే వాదనను అనేక మంది అనేక అనేక సందర్భాలలో వినిపిస్తూ ఉంటారు. కానీ కొంత మంది విషయంలో మాత్రం అది రాంగ్ అని ప్రూ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. కొంత మంది కి అపజయాలు దక్కుతున్న మంచి క్రేజీ సినిమాలలో అవకాశాలను దక్కించుకున్న బ్యూటీ లు కూడా ఉన్నారు. కానీ అలాంటి వారు మంచి విజయం కోసం  అదిరిపోయే రేంజ్ కం బ్యాక్ కోసం ఎదురు చూస్తూ వస్తున్నారు. అలా మంచి కం బ్యాక్ కోసం ఎదురు చూస్తున్న టాలీవుడ్ క్రేజీ బ్యూటీలు ఎవరో తెలుసుకుందాం.

శ్రీ లీల :  శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా రూపొందిన పెళ్లి సందD అనే సినిమాతో ఈ బ్యూటీ తెలుగు తెరకు పరిచయం అయింది. ఈ మూవీ పెద్ద స్థాయి విజయాన్ని సాధించకపోయిన ఇందులో ఈమె తన అందాలతో, డాన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో ఈమెకు ఈ మూవీ ద్వారా మంచి గుర్తింపు  తెలుగు సినీ పరిశ్రమలో వచ్చింది. ఆ తర్వాత నుండి  ఈమెకు క్రేజీ తెలుగు సినిమాలలో అవకాశాలు దక్కుతున్నాయి. ఇప్పటివరకు ఈమెకు సూపర్ సాలిడ్ విజయం దక్కకపోయినా ఈమె నటించిన దాదాపు అన్ని సినిమాల్లో తన అందాలతో, నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ ఉండటంతో వరుస పెట్టి ఈమెకు క్రేజీ సినిమాల్లో అవకాశాలు దక్కుతున్నాయి. ఈ బ్యూటీ ప్రస్తుతం ఒక మంచి హిట్ కొట్టి అదిరిపోయే రేంజ్ కం బ్యాక్ హీట్ కోసం ఎదురు చూస్తున్నట్లు తెలుస్తోంది

భాగ్య శ్రీ  బోర్స్ : ఈమె రవితేజ హీరో గా రూపొందిన మిస్టర్ బచ్చన్ అనే మూవీ తో టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంటర్ ఇచ్చింది. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర డిజాస్టర్ అయిన కూడా ఈ సినిమాలో ఈ బ్యూటీ తన అందాలను అదిరిపోయే రేంజ్ లో ఆరబోయడంతో ఈ మూవీ ద్వారా ఈమెకు మంచి గుర్తింపు వచ్చింది. దానితో ఈమెకు తెలుగులో వరుస పెట్టి అనేక సినిమాలలో అవకాశాలు దక్కాయి. ఈమెకు కనుక ఒక మంచి సాలిడ్ విజయం గనుక దక్కినట్లయితే ఈ బ్యూటీ టాలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ హీరోయిన్ స్థాయికి చేరుకునే అవకాశాలు ఉన్నాయి అని కూడా అనేక మంది అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: