టాలీవుడ్ ఇండస్ట్రీ లో ప్రస్తుతం మంచి క్రేజ్ కలిగిన నటులలో ఒకరిగా కెరియర్ను కొనసాగిస్తున్న వారిలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఒకరు. ఈయన వి వి వినాయక్ దర్శకత్వంలో రూపొందిన అల్లుడు శీను అనే సినిమాతో వెండి తెరకు పరిచయం అయ్యాడు. ఈ సినిమాలో సమంత హీరోయిన్గా నటించగా... దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతం అందించాడు. ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం ఈ మూవీ లో ముఖ్య పాత్రాలలో నటించగా... తమన్నామూవీ లో ఐటెం సాంగ్ చేసింది. ఈ మూవీ 2014 వ సంవత్సరం జూలై 25 వ తేదీన విడుదల అయింది. ఈ మూవీ విడుదల అయ్యి తాజాగా 11 సంవత్సరాలు పూర్తి అయింది. ఈ సినిమా విడుదల అయ్యి 11 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా ఈ సినిమాకు ఆ సమయంలో ఎన్ని కోట్ల కలెక్షన్లు వచ్చాయి. ఎన్ని కోట్ల లాభాలు వచ్చాయి అనే వివరాలను క్లియర్ గా తెలుసుకుందాం.

టోటల్ బాక్సా ఫీస్ రన్ కంప్లీట్ అయ్యే సరికి ఈ మూవీ కి నైజాం ఏరియాలో 7.45 కోట్ల కలెక్షన్లు దక్కగా, సీడెడ్ లో 4.30 కోట్లు, ఉత్తరాంధ్రలో మూడు కోట్లు, ఈస్ట్ lo 1.42 కోట్లు, వెస్ట్ లో 1.35 కోట్లు, గుంటూరులో 2.10 కోట్లు, కృష్ణలో 1.36 కోట్లు, నెల్లూరులో 92 లక్షల కలెక్షన్లు దక్కాయి. మొత్తం గా రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి ఈ మూవీ కి 29.90 కోట్ల కలెక్షన్లు వచ్చాయి. ఇక రెస్ట్ ఆఫ్ ఇండియా మరియు ఓవర్సీస్ లలో కలుపుకొని ఈ సినిమాకు 2.5 కోట్ల కలెక్షన్లు వచ్చాయి. మొత్తంగా ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా 24.55 కోట్ల కలెక్షన్లు దక్కాయి. ఈ సినిమా 22.60 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బాక్స్ ఆఫీస్ బరిలోకి దిగింది. టోటల్ బాక్సా ఫీస్ రన్ కంప్లీట్ అయ్యే సరికి ఈ మూవీ 24.55 కోట్ల షేర్ కలెక్షన్లను ప్రపంచ వ్యాప్తంగా రాబట్టింది. దానితో ఈ మూవీ కి మొత్తంగా 1.95 కోట్ల లాభాలు వచ్చాయి. దానితో ఈ మూవీ ఆ సమయంలో మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

bss