బాలీవుడ్ న‌టుడు హృతిక్ రోషన్, యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో అయాన్ ముఖర్జీ తెర‌కెక్కించిన హై వోల్టేజ్ యాక్షన్ థ్రిల్ల‌ర్ `వార్ 2` విడుద‌ల‌కు సిద్ధ‌మైన సంగ‌తి తెలిసిందే. య‌ష్‌ రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్‌లో రాబోతున్న ఆరో చిత్రమిది. కియారా అద్వానీ హీరోయిన్ గా న‌టించింది. స్వాతంత్ర్య దినోత్సవానికి ముందు ఆగ‌స్టు 14న వార్ 2 విడుద‌ల కాబోతుంది. ఇప్ప‌టికే ఈ చిత్రంపై అటు నార్త్ తో పాటు ఇటు సౌత్‌లోనూ భారీ అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. తాజాగా బ‌య‌ట‌కు వ‌చ్చిన ట్రైల‌ర్ సినిమాపై ఉన్న హైప్‌ను పీక్స్‌కు తీసుకెళ్లింది.


దేశం కోసం పోరాడే ఇద్ద‌రు వీరుల మ‌ధ్య సాగే యుద్ధ‌మే వార్ 2. యాక్షన్ ప్రియులకు ఈ మూవీ ఒక ట్రీట్ అవుతుందని ట్రైల‌ర్‌ హామీ ఇచ్చేసింది. ఇదిలా ఉంటే.. వార్ 2 బ‌డ్జెట్‌, న‌టీన‌ట‌లు రెమ్యున‌రేష‌న్ లెక్క‌లు ప్ర‌స్తుతం నెట్టింట వైర‌ల్ గా మారాయి. యష్ రాజ్ ఫిల్మ్స్ ఆధ్వర్యంలో ఆదిత్య చోప్రా దాదాపు రూ. 210 కోట్ల బ‌డ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇందులో మేజర్ కబీర్ ధాలివాల్ గా హృతిక్ రోష‌న్ క‌నిపిస్తారు. ఈయ‌న తన పాత్రకు రూ. 48 కోట్లు రెమ్యున‌రేష‌న్ తీసుకున్నార‌ట‌.


అలాగే ఆర్ఆర్ఆర్‌ తో గ్లోబ‌ల్ స్టార్‌గా ప్రశంసలు అందుకున్న జూనియర్ ఎన్టీఆర్ వార్ 2 కోసం రూ. 30 కోట్లు రెమ్యున‌రేష‌న్ ఛార్జ్ చేశాడ‌ని అంటున్నారు. అయితే డైరెక్ట‌ర్ క‌న్నా ఎన్టీఆర్ పారితోషిక‌మే త‌క్కువ. ఈ భారీ ప్రాజెక్ట్ ను ముందుండి న‌డిపించి కెప్టెన్ ఆఫ్ ది షిప్‌గా వ్య‌వ‌హ‌రించిన దర్శకుడు అయాన్ ముఖర్జీ రూ. 32 కోట్లు పారితోషికం అందుకున్నారు. ఇక హీరోయిన్ గా గ్లామ‌ర్ తో పాటు యాక్ష‌న్ స‌న్నివేశాల్లోనూ చెల‌రేగిపోయిన కియారా రూ. 15 కోట్లు పుచ్చుకున్న‌ట్లు స‌మాచారం.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు


మరింత సమాచారం తెలుసుకోండి: