ఇండస్ట్రీలో విజయ్ దేవరకొండ అంటేనే ఒక అటిట్యూడ్, ఒక దూకుడు, ఒక రౌడీ వే. ఎప్పుడూ స్పష్టమైన మాటలు, ఖచ్చితమైన అభిప్రాయాలు చెబుతూ అభిమానుల్లో ఎనర్జీ క్రియేట్ చేసే స్టార్. అయితే అదే దూకుడు ఫ్లాప్ సమయంలో కౌంటర్ల రూపంలో తిరిగొస్తుంటుంది. ఈ స్టైల్‌కి ఫ్యాన్స్ ఫిదా అయినా.. సినిమా రిజల్ట్ తేడా వచ్చినప్పుడు అది తీవ్రంగా ట్రోలింగ్‌కి దారి తీస్తోంది. ఈ కష్టమైన పాఠాన్ని రౌడీ తను బాగా నేర్చుకున్నాడు. ఇప్పుడు ఆ మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. ఇటీవల ‘కింగ్‌డమ్’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ జరిగింది. అక్కడ మామూలుగా అయితే, విజ‌య్ త‌న‌ స్టైల్‌లో “ఓపిగానే ఉండండి.. బ్లాస్ట్ చేస్తా..” అనే డైలాగులు చెప్పేవాడు. కానీ ఈసారి మాత్రం విజయ్ చాలా కంట్రోల్‌గా మాట్లాడాడు. ఎక్కడా ఓవర్ డైలాగులు, ఎగిరే మాటలు, హైప్‌ పెంచే స్టేట్మెంట్స్ చెప్పలేదు. “సినిమా ఫలితం మాట్లాడుతుంది” అనే నమ్మకంతో మాత్రమే ముందుకు వచ్చాడు. ఇది చాలా మందిని ఆశ్చర్యపరచింది.


సందీప్ రెడ్డి వంగాతో కలిసి చేసిన చిట్ చాట్ లో కూడా విజ‌య్ మామూలుగా ఉండేలా లేడన్న విషయం స్పష్టంగా తెలిసిపోయింది. మాటల్లో ఆత్మవిశ్వాసం కనిపించినా, అతి ఆత్మవిశ్వాసం లేదు. ఎందుకంటే ఇప్పుడు విజ‌య్‌కు తెలిసిపోయింది – మాటలు కాదు, సినిమా ఫలితం మాట్లాడాలని. ఇది యాదృచ్ఛికం కాదు. ఈ మార్పుకు నిర్మాత నాగవంశీ కీలకంగా ఉన్నారు. ‘కింగ్‌డమ్’ రిలీజ్ ముందు నుంచే విజ‌య్‌ను పూర్తిగా కంట్రోల్ చేస్తూ వచ్చారట. “ఎలాంటి ఇంటర్వ్యూలు ఇవ్వకు.. మీడియా నుంచి దూరంగా ఉండు.. సినిమాకే హైప్ చాలు.. మాటలతో మిస్ ఫైర్ కావొద్దు” అంటూ క్లియర్‌గా చెప్పారట. విజ‌య్ కూడా దాన్ని 100% పాటించాడు. ఇంతవరకూ ఏ మీడియా ఇంటర్వ్యూకీ ఆయన కనిపించలేదు.



ఇది ఇప్పటి హీరోలకి చాలా అవసరం. ఎందుకంటే ఓ చిన్న స్టేట్మెంట్ కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో తుపానులా మారి, సినిమాకే నష్టం తేలుస్తుంది. ప్రత్యేకంగా విజయ్ లాంటి ఎగ్రసివ్ స్టయిల్ ఉన్న స్టార్స్‌కి ఇది మరింత అపాయింట్‌మెంట్. అందుకే ఈసారి విజ‌య్ బండి స్లో చేసాడు. అసలైన స్పీడ్ ఇవ్వాల్సింది మాత్రం హిట్ మాత్రమే. ఈసారి హిట్ రావడం అంటే ఇక విజ‌య్ మళ్లీ ట్రాక్ లోకి వచ్చాడు అని తేలిపోయినట్లే. ఇక ముందుండే ప్రీ రిలీజ్ ఫంక్షన్ ఉండబోతోంది. అక్కడ కూడా విజ‌య్ ఇదే కంట్రోల్ కొనసాగిస్తే, నాగవంశీ స్ట్రాటజీ ఫలించిందని చెప్పొచ్చు. ఫైనల్‌గా చెప్పాల్సిందే – రౌడీ ఇప్పుడు మేచ్యూర్ అయ్యాడు, మాటలతో కాకుండా, మూవీతోనే ఎఫెక్ట్ చూపించాలనుకుంటున్నాడు. ఇప్పుడు ఫ్యాన్స్ అందరి కోరిక కూడా అదే – “బాక్స్ ఆఫీస్ లో మళ్లీ రౌడీ ఊపు కావాలి!”

మరింత సమాచారం తెలుసుకోండి: