రాజా సాబ్.. ప్రభాస్ హీరోగా నటిస్తున్న సినిమా. టాలెంటెడ్ డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది . ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 5వ తేదీ రిలీజ్ కాబోతుంది . ఇప్పటికే చాలాసార్లు ఈ సినిమా వాయిదా పడింది . ఈసారి మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ చెప్పిన తేదీకి సినిమా రిలీజ్ చేయాలి అంటూ మూవీ మేకర్స్ పక్క ప్లాన్ తో ముందుకు వెళ్తున్నారు.  డిసెంబర్ 5వ తేదీ రాజా సాబ్ సినిమా థియేటర్స్ లో రిలీజ్ చేయడానికి పక్క షెడ్యూల్ ఫిక్స్ చేసుకున్నారు . కాగా సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మేకర్స్ ఈ సినిమాకి సంబంధించిన ఒక సెన్సేషనల్ ఫోటోను రిలీజ్ చేశారు .


ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ కూడా నటిస్తున్నాడు అన్న విషయం అందరికీ తెలుసు . సంజయ్ దత్ ఈ సినిమాలో ప్రభాస్ కి తాత పాత్రలో నటిస్తున్నాడు . ఇది ఫుల్ టు ఫుల్ కామెడీ  ఎంటర్టైన్మెంట్ గా తెరకెక్కింది . ఈ సినిమాలో ఇస్మార్ట్ భామ నిధి అగర్వాల్, మాళవిక మోహన్, రిద్ది కుమార్ నటిస్తున్నారు. కాగా ఈరోజు సంజయ్ దత్ పుట్టినరోజు సందర్భంగా సినిమా నుంచి ఆయనకు సంబంధించిన ఒక స్పెషల్ పోస్టర్ ని రిలీజ్ చేశారు . చూడడానికి చాలా హైలెట్గా మారింది ఈ పిక్చర్.



మేకర్స్ ఇప్పటికే లాంచ్ చేసిన రాజా సాబ్ లో ప్రభాస్ సూపర్ స్టైలిష్ గా చేతిలో పూల బొకే పట్టుకొని అద్దంలో తనను తాను చూసుకుంటూ పూలు చల్లుతూ నయా లుక్ లో కనిపిస్తూ అభిమానులను ఎంటర్టైన్ చేశారు.  ఇప్పుడు ప్రభాస్ తాత  హారర్ లుక్ లో కనిపించాడు . అయితే చాలామంది మాత్రం సంజయ్ లుక్స్ చూసి హారర్ ఫిలిం అంటే భయంకరంగా ఉండాలి కానీ ఇంత కామెడీగా ఉంది  ఏంటి ..?? ప్రభాస్ తాతకు భయానక లుక్ సెట్ అవ్వలేదు ప్రభాస్ తాత చాలా కామెడీగా ఉన్నాడు.. అంటూ రకరకాలుగా కామెంట్స్ పెడుతున్నారు . సోషల్ మీడియాలో ఇప్పుడు ఈ ఫోటో బాగా వైరల్ గా మారింది..!



మరింత సమాచారం తెలుసుకోండి: