పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు మొదటి రోజు మిక్స్డ్ టాక్ తెచ్చుకొని మొదటి రోజే ఏకంగా 70 కోట్ల వరకు కలెక్షన్లు సాధించినట్టు సినీ వర్గాలు పేర్కొన్నాయి. అయితే ఇప్పటివరకు హరిహర వీరమల్లు మూవీకి సంబంధించి చిత్ర యూనిట్ అఫీషియల్ గా కలెక్షన్స్ పోస్టర్ మాత్రం రిలీజ్ చేయలేదు.. ఫేక్ కలెక్షన్స్ చూపించడం ఇష్టం లేక కలెక్షన్స్ పోస్టర్ రిలీజ్ చేయడం లేదు అంటూ డైరెక్టర్ జ్యోతి కృష్ణ ఓ ఇంటర్వ్యూలో చెప్పిన సంగతి మనకు తెలిసిందే.అంతే కాదు సినీ వర్గాలు ఎన్ని కోట్లు కలెక్ట్ చేశాయో చెబుతున్నాయి కదా అని మాట్లాడుతూనే త్వరలోనే చిత్ర యూనిట్ తో మాట్లాడి కలెక్షన్స్ పోస్టర్ ని అధికారికంగా ప్రకటిస్తామంటూ కూడా తెలియజేశారు. 

అయితే మొదటి రోజు మిక్స్ట్ టాక్ తెచ్చుకున్న హరిహర వీరమల్లు ఇప్పటికే 108 కోట్ల గ్రాస్ సాధించినట్లు తెలుస్తోంది. అయితే ప్రపంచవ్యాప్తంగా హరిహర వీరమల్లు మూవీ 2.60 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్టు సినీ ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు ఉత్తరాది రాష్ట్రాలు పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమాని కనీసం పట్టించుకోవడం లేదు. అయితే ఇప్పటివరకు హరిహర వీరమల్లు సినిమాకు వచ్చిన కలెక్షన్లు కేవలం 52 శాతం మాత్రమేనని మరో 48 శాతం కలెక్షన్లు రావాల్సి ఉందని తెలియజేశాయి. సినిమా విడుదలై ఇన్ని రోజులైనా కూడా ఇంకా సగం కలెక్షన్లు మాత్రమే వచ్చాయి అంటే ఈ సినిమా కి లాభాలు ఏమో గాని పెట్టిన బడ్జెట్ కూడా వచ్చేలా లేదని సినీ వర్గాల్లో కొంతమంది మాట్లాడుకుంటున్నారు.

 మిక్స్డ్ టాక్ వచ్చింది కాబట్టి సినిమాని చూసేవారి శాతం తక్కువే ముఖ్యంగా వీక్ డేస్ కావడంతో చాలామంది సినిమాని చూడరు. ఇక ఇదే సమయంలో పుండు మీద కారం చల్లినట్టు హోంబలే ఫిలిమ్స్ బ్యానర్ లో వచ్చిన యానిమేషన్ మూవీ మహావతార్ నరసింహ బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం అందుకుంది. ఈ సినిమా హరిహర వీరమల్లు విడుదలయ్యాక  ఒకరోజు తేడాతో థియేటర్లో విడుదలైంది. ఇక మహావతార్ నరసింహ మూవీ అద్భుతంగా ఉండడంతో హరిహర వీరమల్లుని పక్కన పెట్టి చాలామంది ఈ యానిమేషన్ మూవీని చూడడానికే ఆసక్తి చూపిస్తున్నారు. అయితే ఈ సినిమాని తెలుగులో అల్లు అరవింద్ విడుదల చేశారు.

కాబట్టి చాలామంది నెటిజన్లు అల్లు అరవింద్ పవన్ కళ్యాణ్ ని టైం చూసి దెబ్బ కొట్టాడు అంటూ కామెంట్లు పెడుతున్నారు. అంతే కాదు మహావతార్ నరసింహ మూవీ బ్లాక్ బస్టర్ టాక్ తో దూసుకుపోవడంతో హరిహర వీరమల్లు మూవీ కలెక్షన్లు కూడా భారీగా పడిపోయాయి. ఎటు చూసినా కూడా హరిహర వీరమల్లు మూవీకి లాభాలేమో గానీ పెట్టిన బడ్జెట్ కూడా వచ్చేలా కనిపించడం లేదని సినీ వర్గాలు పేర్కొంటున్నాయి. మరి చూడాలి ఈ సినిమాకి పెట్టిన బడ్జెట్ అయిన వస్తుందా లేదా అనేది.

మరింత సమాచారం తెలుసుకోండి: