
శ్రీలంకలోని ఒక దీవిలో స్మగ్లర్స్, గ్యాంగ్ స్టర్ గా పని చేసే అన్నాను కాపాడటానికి కానిస్టేబుల్ అయిన హీరో ఏం చేశాడనే కథాంశంతో ఈ సినిమా తెరకెక్కింది. కథ మరీ కొత్తగా లేకపోయినా కథనంతో మ్యాజిక్ చేశారని చెప్పవచ్చు. గౌతమ్ తిన్ననూరి దర్శకుడిగా ఈ సినిమాతో మరో మెట్టు పైకి ఎదిగారనే చెప్పాలి. కేజీఎఫ్, సలార్ లాంటి సినిమాలను మనం కూడా తెరకెక్కించవచ్చని ఈ సినిమాతో ప్రూవ్ చేశారనే చెప్పాలి.
ఇంటర్వెల్ బ్యాంగ్, క్లైమాక్స్ సన్నివేశాలు సైతం వేరే లెవెల్ లో ఉన్నాయి. క్లైమాక్స్ ట్విస్టును మాత్రం దర్శకుడు వేరే లెవెల్ లో ప్లాన్ చేశారని చెప్పవచ్చు. అనిరుద్ మ్యూజిక్, బీజీఎంతో సినిమాకు పూర్తిస్థాయిలో న్యాయం చేశారు. రగిలే రగిలే సాంగ్ సినిమాకు ప్లస్ అయింది. విజయ్ దేవరకొండ తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. జులై నెలకు బిగ్గెస్ట్ హిట్ ఈ సినిమానే అని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
విజయ్ దేవరకొండ లాంగ్ వీకెండ్ ను క్యాష్ చేసుకోనున్నారని ఫస్ట్ వీకెండ్ కలెక్షన్లతోనే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం అయితే లేదని కామెంట్లు వినిపిస్తున్నాయి. విజయ్ దేవరకొండ కింగ్డమ్ సినిమా సరికొత్త రికార్డులు క్రియేట్ చేయాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. విజయ్ దేవరకొండ రేంజ్ సినిమా సినిమాకు అంతకంతకూ పెరుగుతోంది. సితార బ్యానర్ కు కింగ్ డమ్ సినిమాతో మరో భారీ బ్లాక్ బస్టర్ హిట్ దక్కినట్టేనని చెప్పవచ్చు.