సీత లేనిదే రాముని జీవితం లేదు. సీత లేనిదే రామాయణాన్ని కూడా ఊహించలేము. నేటితరం మహిళలకు సీత ఎంతో ఆదర్శం. సీత ఎన్నో కష్టాలను ఎదురుకొని కూడా ఎంతో ధైర్యంగా నిలబడింది. ఆమె ఓర్పు నేటితరం యువతులకు ఆదర్శం. ఇలా ఎన్నో గొప్ప గొప్ప లక్షణాలు సీత సొంతం. ఎంతో గొప్ప ఆదర్శవంతురాలైన సీత పాత్రలో నటించడం అనేది చాలా కష్టం. ఈ మధ్య కాలంలో రామాయణం మీద అనేక సినిమాలు వస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. రామాయణం మీద సినిమా అంటే సీత పాత్ర కంపల్సరీ. దానితో రామాయణం మీద వస్తున్న సినిమాల్లో సీత పాత్రలు చేస్తున్న వారిపై ట్రోలింగ్ కూడా ఈ మధ్య భారీగానే జరుగుతుంది. కొంత కాలం క్రితం రామాయణం మీద శ్రీరామరాజ్యం అనే సినిమా వచ్చిన విషయం మనకు తెలిసిందే. బాలకృష్ణ ఈ సినిమాలో రాముడి పాత్రలో నటించగా సీత పాత్రలో నయనతార నటించింది.

సీత పాత్రలో నయనతార నటించడంపై అనేక మంది అభ్యంతరాలను వ్యక్తం చేశారు. ఈమె అనేక సినిమాలలో తన అందాలను ఆరబోసింది. అలాంటి వ్యక్తి సీత పాత్రలో నటించడం ఏమిటి అని అనేక మంది అంటూ వచ్చారు. కానీ శ్రీరామరాజ్యం సినిమాలో నయనతార తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. దానితో ఈమె ఆ నెగెటివిటీని చాలా వరకు తగ్గించుకుంది. ఇకపోతే కొంత కాలం క్రితం ఆది పురుష్ అనే సినిమా వచ్చింది. ఈ సినిమా కూడా రామాయణ ఆధారంగా రూపొందింది. ప్రభాస్ ఈ సినిమాలో రాముడి పాత్రలో నటించగా ... కృతి సనన్ ఈ సినిమాలో  సీత పాత్రలో నటించింది. కృతి , సీత పాత్రలో నటించడంపై కూడా అనేక మంది అభ్యంతరాలను వ్యక్తం చేశారు. ఇక సినిమా విడుదల అయ్యాక ఈమె కూడా తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకోవడం వల్ల ఆ అభ్యంతరాలు కాస్త వెనక్కు తగ్గాయి.

ప్రస్తుతం రామాయణ అనే సినిమా రూపొందుతుంది. ఇందులో రన్బీర్ కపూర్ రాముని పాత్రలో కనిపించనుండగా , సాయి పల్లవి , సీత పాత్రలో కనిపించబోతుంది. సాయి పల్లవి ఇప్పటివరకు ఎన్నో సినిమాల్లో నటించిన ఏ సినిమాలో కూడా అందాల ఆరబోత చేయలేదు. అలాంటి నటి సీత పాత్రలో కనిపించబోతుంది అనడంతో ఈమెపై ఎలాంటి ట్రోలింగ్ ఉండదు అని చాలా మంది అనుకున్నారు. కానీ ఈమె సీత పాత్రలో నటిస్తున్న కూడా ట్రోలింగ్ అనేది జరుగుతుంది. దానితో సినిమా విడుదల అయ్యాక సీత పాత్రలో ఈమె అద్భుతంగా నటించినట్లయితే ఆ ట్రోలింగ్ అంతా సైడ్ కు వెళ్లిపోతుంది అని చాలా మంది అభిప్రాయ పడుతున్నారు. మరి రామాయణ మూవీ లో సీత పాత్రలో సాయి పల్లవి తన నటనతో ప్రేక్షకులను ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: