
కానీ పవన్ కళ్యాణ్ "హరిహర విరమల్లు" సినిమా విషయంలో మాత్రం అది మొత్తం రివర్స్ అయిపోయింది . సినిమా రిలీజ్ అయ్యే మూడు నాలుగు రోజుల ముందు నుంచి సినిమాకి ప్రమోషన్స్ నిర్వహించారు పవన్ కళ్యాణ్ . అది కూడా ఎక్కడ హై డప్పు కొట్టుకోలేదు . ఉన్నది ఉన్నట్లు నిజాయితీగా బయటపెట్టారు . ఒకపక్క రాజకీయాలను మరొక పక్క సినిమాలను ఎలా బ్యాలెన్స్ చేశాడో అన్న విషయాన్ని మాత్రమే చెప్పాడు పవన్ కళ్యాణ్ . ఇక విజయ్ దేవరకొండ విషయంలో కూడా అంతే ఎక్కడా కూడా హద్దులు మీరకుండా సింపుల్గా సినిమాకి ఎంత ప్రమోషన్ కావాలో అంతే నిర్వహించుకుంటూ సినిమా గురించే మాట్లాడుకుంటూ పోయారు.
ఎక్కడ కూడా కాంట్రవర్షియాలిటీని బయట పెట్టలేదు. దీంతో ఈ రెండు సినిమాలు కూడా మంచి విజయం అందుకున్నాయి అంటున్నారు ఫ్యాన్స్. హరి హర వీరమల్లు సినిమాతో పవన్ కళ్యాణ్ ..కింగ్డమ్ సినిమాతో విజయ్ దేవరకొండ క్రేజీ హిట్స్ తమ ఖాతాలో వేసుకొని ఇండస్ట్రీని కొత్త రూట్ లో వెళ్లేందుకు దారి చూపించారు అంటున్నారు. చూడాలి మరి నెక్స్ట్ రాబోయే సినిమాలు ఈ ఇద్దరు హీరోలని ఇన్స్పిరేషన్ గా తీసుకొని ఏ విధంగా సినిమాలను ప్రమోట్ చేసుకోబోతున్నారు అనేది..???