పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజాగా హరి హర వీరమల్లు అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించిన విషయం మనకు తెలిసిందే. నిధి అగర్వాల్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటించగా ఏ ఎం రత్నం ఈ సినిమాను నిర్మించాడు. ఈ మూవీ క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో స్టార్ట్ అయ్యింది. ఆ తర్వాత ఈయన ఈ సినిమా దర్శకత్వ బాధ్యతల నుండి తప్పుకోవడంతో జ్యోతి కృష్ణ అనే దర్శకుడు ఈ సినిమాకు సంబంధించిన మిగిలిన భాగం షూటింగ్ను పూర్తి చేశాడు. ఎం ఎం కీరవాణి ఈ సినిమాకు సంగీతం అందించగా ... ఈ సినిమాలో బాబీ డియోల్ విలన్ పాత్రలో నటించాడు. సునీల్మూవీ లో ముఖ్యమైన పాత్రలో నటించాడు. ఈ సినిమా జూలై 24 వ తేదీన భారీ ఎత్తున విడుదల అయ్యింది.

ఈ సినిమాకు విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే బాక్స్ ఆఫీస్ దగ్గర నెగిటివ్ టాక్ వచ్చింది. దానితో ఈ సినిమా పెద్ద స్థాయి కలెక్షన్లను వసూలు చేయలేక పోతుంది. ఈ మూవీvకి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఐదు రోజుల్లో పర్వాలేదు అనే స్థాయి కలెక్షన్లు వచ్చిన ఆరవ రోజు మాత్రం ఈ సినిమా కలెక్షన్లు భారీగా పడిపోయాయి. ఈ మూవీ కి రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి స్పెషల్ షోస్ ద్వారా 8.50 కోట్ల కలెక్షన్స్ దక్కగా ,  మొదటి రోజు 31.43 కోట్లు , రెండవ రోజు 3.82 కోట్లు , మూడవ రోజు 4.45 కోట్లు , నాలుగవ రోజు 5.82 కోట్లు , ఐదవ రోజు 1.16 కోట్ల కలెక్షన్లు  దక్కాయి.

ఇలా మొదటి ఐదు రోజులు ఈ సినిమా మంచి కలెక్షన్లను బాక్స్ ఆఫీస్ దగ్గర రాబట్టింది. కానీ ఆరవ రోజు మాత్రం ఈ సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి కేవలం 62 లక్షల కలెక్షన్లు మాత్రమే దక్కాయి. మొత్తంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆరు రోజుల్లో కలిపి ఈ మూవీ కి 55.80 కోట్ల షేర్ ... 81.70 కోట్ల గ్రాస్ కలెక్షన్లు దక్కాయి. ఈ మూవీ కి ఆరవ రోజు చాలా తక్కువ కలెక్షన్లు దక్కడంతో ఏడవ రోజు నుండి ఈ సినిమా కలెక్షన్లు మరింత తగ్గే అవకాశం ఉంది అని చాలా మంది అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: