ఒక హీరో రిజెక్ట్ చేసిన కథతో మరొక హీరో సినిమా చేయడం అనేది ఇండస్ట్రీలో తరచుగా జరుగుతూనే ఉంటుంది. అలా గతంలో సూపర్ స్టార్ మహేష్ బాబు తిరస్కరించిన కథతో టాలీవుడ్ కింగ్ నాగార్జున సినిమా చేశారు. ఆ సినిమా రిజల్ట్ తెలిస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. ఇంతకీ మహేష్ రిజక్ట్ చేసిన కథతో నాగ్ చేసిన సినిమా ఏదో కాదు `బావ నచ్చాడు`. కె.ఎస్. రవికుమార్ డైరెక్ట్ చేసిన ఈ మూవీలో నాగార్జున‌కు జోడిగా సిమ్రాన్, రీమా సేన్ న‌టించారు.


రోజా మూవీస్ బ్యానర్‌లో ఎం. అర్జున రాజు మూవీని ప్రొడ్యూస్ చేయ‌గా..  ఎంఎం కీరవాణి సంగీతం అందించారు. భారీ అంచ‌నాల న‌డుమ 2001లో రిలీజ్ అయిన బావ న‌చ్చాడు చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద డిజాస్ట‌ర్ గా నిలిచింది. అయితే ఈ సినిమాకు ఫ‌స్ట్ ఛాయిస్ నాగ్ కాదు. డైరెక్ట‌ర్ ర‌వికుమార్ మొద‌ట మ‌హేష్ బాబుతో బావ న‌చ్చాడు చిత్రాన్ని తెర‌కెక్కించాల‌ని ప్లాన్ చేశారు. కేఎస్ రవికుమార్ క‌థ‌కు మ‌హేష్‌ బాబు ఓకే చెప్ప‌డం, ప్రొడ్యూస‌ర్ ఎం అర్జున‌ రాజు నిర్మాత‌గా ఆ సినిమాను అఫీషియ‌ల్‌గా అనౌన్స్ చేయ‌డం కూడా జ‌రిగాయి.


అయితే అప్ప‌టికి మ‌హేష్ బాబు `యువ‌రాజు` మూవీ షూటింగ్ లో బిజీగా ఉన్నారు. వై.వి.ఎస్.చౌదరి డైరెక్ట్ చేసిన ఈ చిత్రం 2000వ సంవ‌త్స‌రంలో విడుద‌లై ఫ్లాప్ అయింది. ఇందులో పెళ్లైన వ్య‌క్తిగా, ఒక బాబుకు తండ్రిగా మ‌హేష్ ను చూపించ‌డం ప్రేక్ష‌కులు జీర్ణించుకోలేక‌పోయారు. ఇక కేఎస్ రవికుమార్ చెప్పిన స్టోరీలోనూ త‌న‌ది అటువంటి క్యారెక్ట‌రే కావ‌డంతో మ‌హేష్ బాబు రిస్క్ అని భావించి సున్నితంగా బావ న‌చ్చాడు మూవీ నుంచి త‌ప్పుకున్నాడు. సేమ్ అదే స్టోరీతో నాగార్జున సినిమా చేసి డిజాస్ట‌ర్‌ను మూట‌గ‌ట్టుకున్నారు.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: