
టాలీవుడ్‌లో హీరోయిన్ కాజల్ అగర్వాల్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. గ్లామర్, పెర్ఫార్మెన్స్, డెడికేషన్ ఈ మూడింటితో ప్రేక్షకుల హృదయాలను దోచుకున్న ఈ అందాల నటి, కెరీర్ ప్రారంభం నుంచి ఇప్పటివరకు ఎన్నో సూపర డూపర్ హిట్ సినిమాల్లో నటించారు. పెళ్లయ్యి ఒక బిడ్డకు తల్లయ్యాక కూడా సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చి సెకండ్ ఇన్సింగ్స్‌ను స్టార్ట్ చేశారు. కాజల్ నటనతో పాటు వ్యక్తిత్వంతో కూడా ఎంతో మందిని ఆకర్షించారు. వెంకీ తన సినిమాల్లో కొత్త నాయికలకు మంచి ఛాన్సులు ఇవ్వడం, వారిని స్టార్‌గా మలచడంలో కూడా వెంకటేష్ పాత్ర ఎంతో ఉంది. దివ్యభారతి, కత్రినా కైఫ్, టబు వంటి బాలీవుడ్ భామల కెరీర్ ప్రారంభంలో వెంకటేష్‌తో నటించడం వల్లే వారికి తెలుగులో ఓ గుర్తింపు వచ్చిందనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే కాజల్ అగర్వాల్ మాత్రం వెంకటేష్‌తో నటించేందుకు ఆసక్తి చూపించలేదన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఇది సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గానే మారింది.
అసలు విషయం ఏమిటంటే, వెంకటేష్ - నాగచైతన్య కాంబినేషన్‌లో వచ్చిన ‘వెంకీ మామ’ సినిమాలో మొదట వెంకటేష్‌కు జోడీగా కాజల్‌ను సంప్రదించారని తెలుస్తోంది. కానీ కాజల్ ఈ పాత్రను తిరస్కరించిందట. కారణం వెంకటేష్‌తో నటించడంలో అభ్యంతరం కాదని, కానీ నాగచైతన్యకు అత్తగా కనిపించే పాత్రలో నటించడం తనకు ఇష్టం లేదని ఆమె స్పష్టంగా చెప్పిందట. కాజల్, నాగచైతన్య జోడీగా గతంలో వచ్చిన ‘దడ’ సినిమా ఆశించిన విజయం సాధించకపోయినా, వీరిద్దరి కెమిస్ట్రీ గురించి అప్పట్లో మంచి ప్రశంసలు వచ్చాయి. ఆ అనుభవం నేపథ్యంలో, కాజల్ తనకు నాగచైతన్య సరసన హీరోయిన్‌గా కనిపించాలనుంది తప్ప వదిన, అత్త పాత్రలపై ఆసక్తి చూపకపోవడం సహజమే. తన గ్లామర్ ఇమేజ్‌ను దృష్టిలో ఉంచుకుని అలాంటి పాత్రలకి దూరంగా ఉండాలనుకోవడం ఆమె స్ట్రాటజీగానూ చెప్పుకోవచ్చు.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు