ఇండస్ట్రీలో ఎంతమంది హీరోయిన్స్ అయిన ఉండొచ్చు .. పాన్ ఇండియా లెవల్ లో క్రేజ్ సంపాదించుకొని చేతినిండా ఆఫర్స్ తో కాల్ షీట్స్ అన్ని ఫీల్ అయిపోయిన హీరోయిన్స్ ఉండొచ్చు . కానీ హీరోయిన్ అనుష్కకి ఉన్న క్రేజీ  ఫ్యాన్ ఫాలోయింగ్ .. రెస్పెక్ట్ మరి ఏ హీరోయిన్ కి ఇండస్ట్రీలో లేదు అని చెప్పాలి . అనుష్క అంటే అంత లైక్ చేస్తూ ఉంటారు అభిమానులు . టాలీవుడ్ ఇండస్ట్రీలో జేజమ్మగా పాపులారిటీ సంపాదించుకున్న అనుష్క ఎప్పుడు కూడా అభిమానులకి ఫేవరెట్ హీరోయిన్ .


సినిమా ఇండస్ట్రీలో ఆమెకు గ్యాప్ వచ్చిన ఆమె క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ విషయంలో మాత్రం ఎక్కడా తగ్గేదేలే అనే విధంగా ప్రూవ్ చేసుకుంటుంది . చాలా టైం గ్యాప్ తీసుకొని "మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి" అనే సినిమాలో నటించింది.  ఈ సినిమా మంచి విజయం అందుకుంది . అంతేకాదు రీసెంట్ గానే "ఘాటి" సినిమాలో నటించింది.  ఈ సినిమా పక్కాగా ప్లాన్ చేసుంటే జూలైలోనే విడుదల అవ్వాలి ..కొన్ని కారణాల చేత ఈ సినిమా వాయిదా పడింది . దీంతో అనుష్క శెట్టి అభిమానులు నిరాశ చెందారు .



అయితే ఇప్పుడు కొత్త రిలీజ్ డేట్ ఇదే అంటూ సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి . సెప్టెంబర్ 5వ తేదీ ప్రపంచవ్యాప్తంగా అనుష్క ప్రధాన పాత్రలో నటించిన "ఘాటి" సినిమా రిలీజ్ కాబోతుంది అన్న న్యూస్ ట్రెండ్ అవుతుంది . ఇదే ఫైనల్ రిలీజ్ డేట్ అంటూ చిత్త బృందం ఒక నిర్ణయానికి వచ్చేసిందట . అయితే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ని వైజాగ్ లో ఘనంగా నిర్వహించాలి అంటూ ప్లాన్ చేస్తుందట  మూవీ టీం. అంతేకాదు అనుష్క బెస్ట్ ఫ్రెండ్ అయిన ప్రభాస్ ని ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి చీఫ్ గెస్ట్ గా పిలవాలి అంటూ ప్లాన్ చేస్తున్నారట మేకర్స్. ఒకవేళ అదే నిజమైతే మాత్రం చాలా కాలం తర్వాత మళ్లీ మనం ప్రభాస్ - అనుష్కను పక్క పక్కన చూడబోతున్నాం అని అనుకోవాలి . ఈ మధ్యకాలంలో అసలు వీళ్ళు కలిసి కనిపించిందే లేదు . బాహుబలి రిలీజ్ అయి 10 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్న మూమెంట్ లోను అనుష్క డుమ్మా కొట్టేసింది.  చూడాలి మరి మూవీ మేకర్స్ ప్రభాస్ ని ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ఎలా ఒప్పిస్తారు అనేది..??

మరింత సమాచారం తెలుసుకోండి: