
ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా మృణాల్ ఠాకూర్ సెలెక్ట్ అయినట్లు టాక్ వినిపిస్తుంది . కానీ ఇప్పటివరకు అయితే అఫీషియల్ ప్రకటన రాలేదు . సోషల్ మీడియాలో సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు అల్లు అర్జున్ - అట్లీ మూవీకి సంబంధించిన ఒక విషయం బాగా ట్రెండ్ అవుతుంది. అల్లు అర్జున్ సినిమా లో ఏ ఐ టెక్నాలజీ యూస్ చేసి ఒక పది నిమిషాల పాటు సాగే ఫైట్ సీను చిత్రీకరించబోతున్నారట . నిజానికి రాజమౌళి - మహేష్ బాబు తెరకెక్కించే సినిమా కోసం ఏఐ టెక్నాలజీని రకరకాలుగా వాడేస్తున్నారు.
కానీ ఈ సినిమా రిలీజ్ అవ్వాలంటే దాదాపు 3 ఏళ్ల పై మాటే . కానీ ఈలోపే అల్లు అర్జున్ - అట్లీ సినిమా రిలీజ్ కాబోతుంది. ఆ విధంగా చూసుకుంటే మహేష్ బాబు ని ఏఐ టెక్నాలజీలో ఫైట్ సీన్స్ లో చూడడం కన్నా ముందే అల్లు అర్జున్ ని అలాంటి ఒక టెక్నాలజీ యూస్ చేసిన ఫైట్ సీన్స్ మనం చూడబోతున్నాం. కోలీవుడ్ ఇండస్ట్రిలో ఇప్పుడు ఇదే న్యూస్ బాగా ట్రెండ్ అవుతుంది. సోషల్ మీడియాలో దీని గురించి రకరకాలుగా చర్చించుకుంటున్నారు జనాలు . అట్లీది ఏం తెలివి రా బాబు అంటూ పొగిడేస్తున్నారు..!!