
ఏక్తా టైగర్ : స్పై యాక్షన్ ఎంటర్టైనర్ మూవీగా రూపొందిన ఈ సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 9.70 కోట్ల గ్రాస్ కలెక్షన్లు దక్కాయి.
టైగర్ జిందా హై : ఈ సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాల్లో 16 కోట్ల గ్రాస్ కలెక్షన్లు దక్కాయి.
వార్ : ఈ మూవీ కి రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 4.6 కోట్ల షేర్ ... 12.85 కోట్ల గ్రాస్ కలెక్షన్లు దక్కాయి.
పటాన్ ఈ సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 31.5 కోట్ల గ్రాస్ కలెక్షన్లు దక్కాయి.
టైగర్ 3 : ఈ సినిమాకి రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 6.9 కోట్ల గ్రాస్ కలెక్షన్లు దక్కాయి.
ఆగస్టు 14 వ తేదీన వార్ 2 సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో టాలీవుడ్ స్టార్ నటులలో ఒకరు అయినటువంటి తారక్ ప్రధానమైన పాత్రలో కనిపించబోతున్నారు. దానితో ఈ మూవీ కి రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ కలెక్షన్లు రావడం పక్కా అని చాలా మంది అభిప్రాయ పడుతున్నారు. దానితో ఈ మూవీ ఇప్పటివరకు ఏ హిందీ స్పై యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ వసూలు చేయని కలెక్షన్లను రెండు తెలుగు రాష్ట్రాల్లో బస్సులు చేసి టాప్ స్థానంలో నిలుస్తుంది అని చాలాnమంది భావిస్తున్నారు. మరి ఈ సినిమా ఏ స్థాయి కలెక్షన్లను రెండు తెలుగు రాష్ట్రాల్లో వసూలు చేస్తుంది అనేది తెలియాలి అంటే మరి కొన్ని రోజులు వేచి చూడాల్సిందే.