కొన్ని కొన్ని సార్లు స్టార్ హీరోల ఫ్యాన్స్ ఆలోచించే పద్ధతి చాలా చిత్ర విచిత్రంగా ఉంటూ ఉంటుంది . మరీ ముఖ్యంగా ఈ మధ్యకాలంలో ప్రభాస్ ఫ్యాన్స్  ఒక విషయాన్ని బాగా ట్రెండ్ చేశారు . ప్రభాస్ ని పలు రీజన్స్ తో టార్చర్ పెట్టిన ఒక హీరోయిన్ గురించి హైలెట్ చేస్తూ మాట్లాడారు . దానికి సంబంధించిన డీటెయిల్స్ సోషల్ మీడియాలో మరొకసారి ట్రెండ్ అవుతున్నాయి . మనకు తెలిసిందే ప్రభాస్ బిగ్ బడా పాన్ ఇండియా స్టార్ . ఆయనతో నటించే అవకాశం వస్తే ఏ హీరోయిన్ మిస్ చేసుకోరు . అంతేకాదు ఆయనతో వర్క్ చేసే అవకాశం  కోసం హీరోయిన్ లు ఎక్కువగా వెయిట్ చేస్తూ ఉంటారు .


కాగా ప్రభాస్ "రాధే శ్యామ్" సినిమాలో అలాంటి లక్కీ ఛాన్స్ కొట్టేసింది పూజ హెగ్డే . ఈ సినిమాలో  ప్రభాస్ తో స్క్రీన్ షేర్ చేసుకొని వావ్ అనిపించింది . అయితే సినిమా షూటింగ్ టైంలో ప్రభాస్ ని దూరం పెడుతూ ఉండడం ఎవరైనా ప్రభాస్ తో ఫోటోగ్రాఫ్ అని వస్తే ఆమె ముఖం తిప్పుకొని ఫోటో ఇవ్వకుండా వెళ్లిపోవడం లాంటివి చేసింది అన్న టాక్ బాగా గట్టిగా వినిపించింది . అంతే కాదు ప్రెస్ మీట్ లో కూడా పూజ హెగ్డే కొంచెం హెడ్ వెయిట్ తో బిహేవ్ చేసింది అన్న టాక్ వినిపించింది .



సీన్ కట్ చేస్తే ఇప్పుడు ఆ పూజ హెగ్డే ఎలాంటి పరిస్థితిలో ఉందో అందరికీ తెలిసిందే . అవకాశాలు లేక ఐటెం సాంగ్స్ చేసుకుంటూ బ్రతికేస్తుంది . ఇదే క్రమంలో సోషల్ మీడియాలో మరొకసారి ఈ విషయాన్ని హైలెట్ చేస్తున్నారు ప్రభాస్ ఫ్యాన్స్ . మా ప్రభాస్ ని ఏడిపించుకుంటే ఎవరికైనా అంతే అని ..పూజ హెగ్డేను టార్గెట్ చేసి మరీ ట్రోల్ చేస్తున్నారు.  సోషల్ మీడియాలో ఇప్పుడు ఇదే న్యూస్ బాగా వైరల్ గా మారింది. ప్రజెంట్ పూజ హెగ్డే ఖాతాలో ఒక్కటంటే ఒక్క బిగ్ ఆఫర్ కూడా లేదు కానీ ప్రభాస్ మాత్రం పలు పాన్ ఇండియా సినిమాలతో బిజీ బిజీగా షూటింగ్ ని ముందుకు తీసుకెళ్ళిపోతున్నారు..!

మరింత సమాచారం తెలుసుకోండి: