
అయితే ఈ ప్రమాదం జరగడంతో వెంటనే ఆ ప్రాంతంలో పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ కూడా నెలకొంది. దీంతో ట్రాఫిక్ ను కంట్రోల్ చేసేందుకు పోలీసులు అక్కడికి పెద్ద ఎత్తున చేరుకున్నారు.ఈ సంఘటన జరగడంతో ప్రజలు కూడా కొంతమేరకు భయాందోళనకు గురవుతున్నట్లు తెలుస్తోంది. అతి కష్టం మీద లారీ ముందు అద్దాలను పగలకొట్టి మరి డ్రైవర్ బయటకు వచ్చినట్లుగా అక్కడ స్థానికులు తెలియజేస్తున్నారు. దీంతో వెంటనే ఆ డ్రైవర్ ను దగ్గరలో ఉండే ఆసుపత్రికి కూడా తరలించినట్లు వినిపిస్తున్నాయి. అయితే ఈ ప్రమాదంలో మాత్రం ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని అధికారులు తెలియజేస్తున్నారు. ఈ ఘటన పైన పోలీసులు కేసు నమోదు చేసి మరి దర్యాప్తు చేయబోతున్నట్లు తెలుస్తోంది.
ఈ ఘటన పైన పూర్తి విచారణ చేయబడతామంటూ అధికారులు కూడా తెలియజేస్తున్నారు. మరి ఈచర్ కు సంబంధించి ఓనర్ కి కూడా తగిన న్యాయం జరిగేలా చూస్తామంటూ పోలీస్ అధికారులు తెలియజేస్తున్నారు. ఈ అనుకోని ప్రమాదం సంఘటన జరగడంతో ఒక్కసారిగా అధికారులు అప్రమత్తం అవ్వడంతో పెద్ద ప్రమాదం తప్పిందని ప్రజలు కూడా తెలియజేస్తున్నారు.