
కానీ తన కాళ్లపై తను నిల్చోవాలి అనే కోరికతో చాలా కష్టపడుతుంది. ఫ్రెండ్స్ తో చాలా సరదాగా గడుపుతూ ఉండే నిహారిక రీసెంట్ గా ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయబోతుంది అన్న విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. తన ఫ్రెండ్ అంబటి భార్గవి తో యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయబోతుంది నిహారిక. ఒక వారం నుంచి ఊరించి ఊరించి ఫైనల్లీ అసలు విషయాన్నీ రివిల్ చేసింది మెగా డాటర్ నిహారిక . ఒకరిని ఒకరు ఎత్తుకొని హ్యాపీ మూమెంట్స్ పంచుకున్న క్షణాలను అభిమానులతో షేర్ చేసుకుంది.
ఈ ఫ్రెండ్షిప్ ఫుల్ బ్లోన్ యూట్యూబ్ ఛానల్ గా మారింది. సిస్టర్ హుడ్ ఎనర్జీని మీ స్క్రీన్ పైకి తీసుకురాబోతున్నాం.. ఇక వ్లాగ్స్, ట్రావెల్ ,ప్రతి గర్ల్ హాట్ డ్రీమ్స్ ని పరిచయం చేయబోతున్నాం " అంటూ పోస్ట్ పెట్టింది. దీనితో నిహారిక పేరు ఇప్పుడు మరొకసారి ఇండస్ట్రీలో మారుమ్రోగిపోతుంది . నిహారిక అసలు యూట్యూబ్ ఛానల్ పెట్టాల్సిన అవసరమే లేదు ..చాలా రిచ్ కానీ ఒక గర్ల్ ఎలా ఉండాలి అనుకుంటుంది ..ఎలా ఫ్రీడం గా తన లైఫ్ని జీవించాలి అనుకుంటుంది.. ఏ విధంగా గర్ల్స్ కొన్ని ఇష్టాలను తీర్చుకోవాలి అనుకుంటుంది అనే విషయాలను తన వ్లాగ్స్ ద్వారా పరిచయం చేయబోతుంది..ఈ యూట్యూబ్ ఛానల్ తో అంటూ క్లియర్ గా అర్థం అయిపోయింది . విడాకుల తర్వాత నిహారిక లైఫ్ అయిపోయింది అని ఇక ఆమె కెరియర్ స్పాయిల్ అయిపోయినట్లే అంటూ చాలామంది అనుకున్నారు . కానీ విడాకుల తర్వాతే అసలు లైఫ్ స్టార్ట్ చేసింది నిహారిక. ఒక్కొక్క స్టెప్ ఎదుగుతూ అందరికీ ఇన్స్పిరేషన్ గా నిలుస్తుంది..!!