తెలుగు సినిమా ఇండస్ట్రీలో అందరూ హీరోలు ఒక లెక్క అయితే  మహేష్ బాబు మరో లెక్క.. ఈయన ఏ చిత్రంలో చేసిన చాలా డిఫరెంట్ గా ఉంటుంది. మహేష్ బాబుకు లేడీ ఫ్యాన్స్ ఎక్కువగా ఉంటారు. అలాంటి ఈయన ఇప్పటికీ ఐదు పదుల వయస్సులో అడుగుపెట్టినా కానీ 20 ఏళ్ల కుర్రాడిలా కనిపించడం  స్పెషాలిటీ. ఇండస్ట్రీలో చాలామంది హీరోలు మహేష్ బాబును చూసి కుళ్ళు కుంటారు. ఆయన తోటి హీరోలు, స్నేహితులంతా ఇప్పటికే ముసలి వాళ్ళలా కనిపిస్తూ ఉంటే మహేష్ బాబు మాత్రం రోజురోజుకు యంగ్ గా తయారవుతున్నారు. ఆయన అలా కనిపించడానికి  కారణాలు ఏంటో కూడా చాలా సందర్భాల్లో చెప్పుకొచ్చారు. 

అలాంటి మహేష్ బాబు తాజాగా తన 50వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయన గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం..ప్రిన్స్ మహేష్ బాబు హీరో కృష్ణ నటవారసుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు.. ఈయన చేసిన మొదటి చిత్రం రాజకుమారుడు.. ఈ సినిమాకి  కోటి లోపే రెమ్యూనరేషన్ తీసుకున్న ఆయన ప్రస్తుతం 100 కోట్ల రెమ్యునరేషన్ తీసుకునే స్థాయికి ఎదిగారు. ప్రస్తుతం ఇండస్ట్రీలో క్లాస్, మాస్, లవ్ ఇలా ఏ చిత్రమైన సరే ఆయన నటించడమే కాదు జీవించేస్తారు. అలాంటి సూపర్ స్టార్ ఇప్పటివరకు  ఇండస్ట్రీలో ఆ ఒక్క పని మాత్రం చేయలేదు. ఇంతకీ అది ఏంటయ్యా అంటే  వేరే రీమేక్ సినిమాల్లో నటించడం..

ఈయన ఇప్పటికీ ఒక్క రీమేక్ సినిమాలో కూడా నటించలేదు. అదే మహేష్ బాబు స్పెషాలిటీ.. అంతేకాదు ఇండస్ట్రీలో  ఒక్క వివాదం కూడా లేని హీరో అంటే కూడా మహేష్ బాబే. హీరోయిన్లను వేధించడం అలాంటివి ఇప్పటివరకు ఈయన మీద రాలేదు. కేవలం నమ్రతనే ప్రేమించాడు, డైరెక్ట్ గా ఆమెనే పెళ్లి చేసుకున్నాడు తప్ప ఇతర హీరోయిన్ల జోలికి మాత్రం వెళ్ళలేదు. ఇలా సినిమాలు, తన కుటుంబం,  బిజినెస్ లు  తప్ప మరో విషయాల్లో వేలు పెట్టని హీరో. అలాంటి మంచి హీరోకు ఇండియా హెరాల్డ్ తరఫునుండి పుట్టినరోజు శుభాకాంక్షలు..

మరింత సమాచారం తెలుసుకోండి: