- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . . .

ఎంజీఆర్ తుకారాం దర్శకత్వంలో ఓ బ్యూటీఫుల్ లవ్ స్టొరీ తెర .. ఎస్ఎల్ఎన్ సినీ క్రియేషన్స్, ప్రణధి క్రియేషన్స్, నవ నారాయణ సినీ క్రియేషన్స్ బ్యానర్స్ పై కీర్తన నరేష్ T. R. ప్రసాద్ రెడ్డి వెంకట్రాజుల, గాయిత్రమ్మ అంజనప్ప నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి "కాగితం పడవలు'అనే టైటిల్ పెట్టారు .. మేకర్స్ రిలీజ్ చేసిన గ్లింప్స్ ఆడియన్స్ ని కట్టిపడేసింది. ''చాలా దూరం వెళ్ళిపోయావు గోదావరి. నిన్ను ఎక్కడ వదిలేశానో అక్కడే నిలబడి ఉన్నాను రామ్''అనే డైలాగ్స్ ప్రేమకథలోని డెప్త్ ని తెలియజేస్తున్నాయి. తీరంలో ఓ జంట కలుసుకోవడం, విజువల్స్, నేపధ్య సంగీతం అన్నీ అద్భుతంగా వున్నాయి. . సినిమాపై చాలా క్యురియాసిటీ పెంచాయి. .


దర్శకుడు ఎంజీఆర్ తుకారాం లవ్లీ ఎమోషన్స్ , హృదయాన్ని తాకే కథ, అందమైన విజువల్స్ తో ఈ చిత్రాన్ని మలిచినట్లు గ్లింప్స్ చూస్తే అర్ధమౌతోంది.
సోషల్ మీడియాలో గ్లింప్స్ వీడియో విస్తృతంగా షేర్ అవుతుంది. గ్లింప్స్ రానున్న ప్రమోషనల్ కంటెంట్ పై చాలా మంచి అంచనాలు పెంచింది.  
ఈ చిత్రానికి AIS. నౌఫల్ రాజా మ్యూజిక్ అందిస్తున్నారు. రుద్రసాయి & జానా డీవోపీ గా పని చేస్తున్నారు జెస్విన్ ప్రభు ఎడిటర్. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఎం. హిమ బిందు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. .


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి. .

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: